Bigg Boss 4 Contestant Surya Kiran : దర్శకుడు వంశీ తెరకెక్కించిన ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది
Bigg Boss 4 Contestant Surya Kiran : దర్శకుడు వంశీ తెరకెక్కించిన 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నటి కళ్యాణి.. ఈ సినిమా మంచి హిట్ కావడంతో పెళ్లాంతో పనేంటి, వసంతం మొదలగు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. ఇలా హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే తమిళ దర్శకుడు సూర్యకిరణ్ ని ప్రేమించి 2010లో వివాహం చేసుకుంది. అయితే అయితే కల్యాణి, ఆమె భర్త సూర్య కిరణ్ విడిపోయారంటూ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రచారం సాగుతోంది. అయినప్పటికీ దీనిని వారు ఖండిచలేదు..
అయితే తాజాగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 04 నుంచి బయటకు వచ్చిన సూర్యకిరణ్ HMTV ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.. ఈ ఇంటర్వ్యూలో అయన మాట్లాడుతూ ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చారు.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కళ్యాణి తానూ విడిపోయినట్టుగా సూర్య కిరణ్ వెల్లడించాడు.. అయితే ఇప్పటికి కళ్యాణి అంటే తనకి చాలా అభిమానం, గౌరవం ఉందని అన్నాడు.. తిరిగి ఆమె నా జీవితంలోకి వస్తానంటే సంతోషంగా ఆహ్వానిస్తానని అన్నాడు.. ఇక కల్యాణి నన్ను ఇష్టపడకపోవడానికి తనకి పర్సనల్‌గా కొన్ని కారణాలున్నాయని వెల్లడించాడు..
ప్రస్తుతం హీరోయిన్ గా ఫెడ్ అవుట్ అయిన కళ్యాణి వదిన అక్క పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. ఇక గత ఏడాది యాత్ర సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఇక అటు సూర్యకిరణ్ సుమంత్ హీరోగా వచ్చిన సత్యం సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ధన 51, రాజుభాయ్ మొదలగు చిత్రాలక్కి దర్శకత్వం వహించాడు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire