బిగ్ బాస్3 అంతా అనుకున్నట్టే..

బిగ్ బాస్3 అంతా అనుకున్నట్టే..
x
Highlights

వివాదాలకు కేరాఫ్ ఎడ్రస్ బిగ్ బాస్ షో. హిందీలో పాపులర్ షోగా ప్రసిద్ధి పొందిన ఈ రియాల్టీ షో తరువాత దేశంలోని అనేక భాషల్లో తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది....

వివాదాలకు కేరాఫ్ ఎడ్రస్ బిగ్ బాస్ షో. హిందీలో పాపులర్ షోగా ప్రసిద్ధి పొందిన ఈ రియాల్టీ షో తరువాత దేశంలోని అనేక భాషల్లో తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. తెలుగులో రెండు సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో.. మూడో సీజన్ నిన్న ప్రారంభం అయింది. మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఅర్ హోస్ట్ గా వ్యవహరించారు. రెండో సీజన్ కు నానీ ఆ స్థానంలోకి వచ్చారు. ఇప్పుడు మూడో సీజన్ కు కింగ్ నాగార్జున ను ఎంపిక చేసుకుంది బిగ్ బాస్. మొదటి రెండు సీజన్ లు ప్రారంభం అయ్యాకా.. వివాదాలు మొదలయ్యాయి. అదీ, ఇందులో పాల్గొన్న వారి ఎలిమినేషన్స్ విషయంలో ఎక్కువ వివాదాలు జరిగాయి. రెండో సీజన్ లో విజేత విషయంలో చాలా వివాదం రేగింది. కానీ, మూడో సీజన్ మాత్రం ప్రారంభం కాక్కుండానే వివాదాల్లో చిక్కుకుంది.

బిగ్ బాస్3 పై కోర్టులో కేసులు వేశారు. ఏకంగా దిల్లీలో నిరసన ప్రదర్శనలూ చేశారు. అంతేకాదు నాగార్జున ఇంటిని ముట్టడించడానికి కూడా ప్రయత్నించారు. ఇన్ని వివాదాల మధ్య అనుకున్న సమయానికి కార్యక్రమం ప్రారంభం అవుతుందో లేదో అని భావించారందరూ.. అయితే, అన్నిటినీ దాటుకుని ఆదివారం రాత్రి ముందుగా ప్రకటించినట్టుగానే బిగ్ బాస్3 ప్రారంభం అయింది.

నాగ్ లుక్స్ అదుర్స్..

నాగార్జున టీవీ కార్యక్రమాల్లో బాగా ఇమిడిపోతారు. ఆ విషయం కౌన్ బనేగా కరోడ్ పతి తెలుగు వెర్షన్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు' రుజువు చేసింది. ఇప్పుడు బిగ్ బాస్3 కి ఆయనే హోస్ట్ అనగానే అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే నాగార్జున ఎంట్రీ అదిరింది. అంతే కాదు నాగార్జున తనదైన వెస్ట్రన్ స్టైల్ లో పార్టిసిపెంట్ లను ఆహ్వానించి ఓహో అనిపించారు.

సోషల్ మీడియాలో వైరల్ అయినట్టుగానే..

ఇక ఈ షోలో పార్టిసిపెంట్ల గురించి ఎన్నో పేర్లు గత రెండు మూడు నెలలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వచ్చాయి. అయితే వారం రోజుల ముందు నుంచి ఓ పదిహేను పేర్లు మాత్రం కచ్చితంగా వీరే అంటూ సోషల్ మీడియాలో దర్శనమిస్తూ వచ్చాయి. షోలో ఎవరెవరు పాల్గొంటారు అనీ విషయంలో ఎంతో గోప్యత పాటిస్తుంది బిగ్ బాస్ టీం. అయితే, ఈసారి అందులో విఫలం అయ్యారనే చెప్పాలి. ఎవరెవరు షోలో ఉంటారని అంచనాలు వేశారో.. ప్రచారం జరిగిందో సరిగ్గా అలానే పార్టిసిపెంట్లు ఉండడడంతో ప్రేక్షకుల్లో కొంత మజా లేకుండా చేసిందని చెప్పొచ్చు.

ఊహించిందే అయినా..

ఈసారి షోలో దంపతులు పాల్గొంటారని చాలా కాలం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయింది. నటుడు వరుణ్ సందేశ్, అతని భార్య వితిక షేరుతో కల్సి షోలో పాల్గోబోతున్నారని వార్తలు వచ్చాయి. సరిగ్గా అదే జరిగింది. బిగ్ బస్ హౌస్ లో అడుగుపెట్టిన తొలి దంపతులుగా వీరు రికార్డు సృష్టించారు.

హడావుడి పడ్డారా?

చాలా సందడిగా ప్రారంభ ఎపిసోడ్ ఉంది. అయితే, గత రెండు సీజన్ లతో పోలిస్తే కొంచెం కళ తప్పినట్టు అనిపించింది. నాగార్జున హోస్ట్ కాబట్టి కొంత వరకూ ఆ లోటు కనిపించలేదు కానీ, ముందటి ఎపిసోడ్ లతో పోలిస్తే ప్రారంభం కొంత నీరసంగానే సాగినట్టు చెప్పొచ్చు. గత సీజన్లలో పార్టిసిపెంట్ల పరిచయం చాలా బావుంది. కానీ, ఈసారి మాత్రం ఎందుకో అంత చక్కగా కుదరలేదు. బహుశా సమయం చాలక పోవడంతో హడావుడిగా కార్యక్రమాన్ని ప్రారంభించడం వలన కావచ్చు.

ఇక సందడి ప్రారంభం..

టీవీ రియాల్టీ షోలలో బిగ్ బాస్ తీరే వేరు. మనవ సహజమైన ఎన్నో విశేషాల్ని.. లోపాల్ని.. వెలికితీస్తుంది. ఈ క్రమంలో ప్రేక్షకులు కూడా ఈ వంద రోజుల పాటు హౌస్ లో జరిగే విషయాల పట్ల చర్చోపచర్చల్లో మునిగిపోతారు. ప్రతిరోజూ రాత్రి రెండు గంటల పాటు పార్టిసిపెంట్ల పంచాయతీ దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ప్రతిధ్వనిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories