Bigg Boss 7 Telugu: రతికా కోసం మరొకరు బలి.. దీపావళి నాడు షాకింగ్ ఎలిమినేషన్.. బైబై చెప్పేసిన బోలే..!

Bhole Shavali Eliminated From 10 th Week of Bigg Boss 7 Telugu
x

Bigg Boss 7 Telugu: రతికా కోసం మరొకరు బలి.. దీపావళి నాడు షాకింగ్ ఎలిమినేషన్.. బైబై చెప్పేసిన బోలే..!

Highlights

Bhole Shavali: దీపావళి సెలబ్రేషన్స్ దేశమంతా ఘనంగా జరిగాయి. అయితే, బిగ్ బాస్ హౌస్ లోనూ సెలబ్రేట్ చేశారు.

Bhole Shavali: దీపావళి సెలబ్రేషన్స్ దేశమంతా ఘనంగా జరిగాయి. అయితే, బిగ్ బాస్ హౌస్ లోనూ సెలబ్రేట్ చేశారు. అయితే, దీపావళీ ఆదివారం రావడంతో చివర్లో ఎలిమినేషన్ ట్విస్ట్ కూడా ఉంటుందనే విషయం తెలిసిందే. హోస్ట్ కింగ్ నాగార్జున కంటెస్టెంట్‌లను సంతోషంతో ముంచెత్తారు.

ఈ ఫెస్టివల్ సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ నిర్వహించారు. కంటెస్టెంట్ల ఫ్యామిలీతోపాటు, స్నేహితులను నాగర్జున స్టేజ్ మీదకి తీసుకువచ్చారు. దీంతో అక్కడి వాతావరణం కాస్తా ఎమోషనల్‌గా మారింది. రితికా సింగ్, ఫరియా అద్భుల్లా డాన్స్ తో సందడి చేశారు. ఇక హైపర్ ఆది ఎంట్రీ ఇవ్వడంతో నవ్వులు పూశాయి.

ఇక నామినేషన్స్ విషయానికి వస్తే.. శివాజీ, యావర్, బోలే, రతికా, గౌతమ్ లిస్టులో చేరారు. అయితే, అంతా రతికా ఎలిమినేట్ అవుతుందని భావించారు. కాని, బిగ్ బాస్ మాత్రం బోలెను ఎలిమినేట్ చేశాడు. ఓటింగ్ లో ఇద్దరి మధ్య పెద్దగా తేడా లేకపోయానా.. లక్ మాత్రం రతికా వైపు ఉండడంతో.. బోలే ఎలిమినేట్ అయ్యాడు.

ఇకపోతే భోలె.. రోజుకు రూ.35 వేల చొప్పున అంటే వారానికి దాదాపు రూ.2.5 లక్షల లెక్క రెమ్యునరేషన్ అందుకున్నాడట. అలా లెక్కేసుకుంటే ఐదు వారాలకుగానూ రూ.12 లక్షల వరకు సంపాదించాడని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories