OTT: 8 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి.. రానా, సమంతలు నటించిన..

Bangalore Days Telugu OTT
x

Bangalore Days Telugu OTT

Highlights

Bangalore Days Telugu OTT: 2014లో వచ్చిన బెంగళూరు డేస్‌ (Bangalore Days) మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది.

Bangalore Days Telugu OTT: ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ బాగా విస్తరిస్తోంది. ఓటీటీకి క్రమంగా ప్రేక్షకులు అట్రాక్ట్ అవుతున్నారు. దీంతో నిర్మాణం సంస్థలు సైతం మూవీస్‌ను ఓటీటీలో విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఎప్పుడో విడుదలైన చిత్రాలను సైతం తాజాగా మళ్లీ ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఇతర భాషల్లో విడుదలైన చిత్రాలను సైతం తెలుగులోకి డబింగ్‌ చేసి మళ్లీ లెటెస్ట్‌గా ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రేక్షకులను అలరించేందుకు మరో చిత్రం సిద్ధమైంది. ఇంతకీ ఏంటా మూవీ.? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

2014లో వచ్చిన బెంగళూరు డేస్‌ మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది.యూత్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. దుల్కర్, నివీన్ పౌలి, నజ్రియా, పార్వతి లీడ్‌ రోల్స్‌లో నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాను 2016లో తమిళంలోకి రీమేక్‌ చేశారు.

తమిళంలో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. 2016లో విడుదలైన ఈ సినిమాలో ఆర్య, శ్రీదివ్య, బాబీ సింహా, రానా, సమంతలు ప్రధాన పాత్రలో నటించారు. అయితే అదే సమయంలో ఈ సినిమాను తెలుగులో విడుదల చేద్దామని మేకర్స్‌ భావంచారు. కానీ ఆ సమయలో కుదర్లేదు. దీంతో బెంగళూరు డేస్‌ తమిళ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

దాదాపు 8 ఏళ్ల తర్వాత చిత్ర యూనిట్ బెంగళూరు డేస్‌ తెలుగు వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగులోకి డబ్బింగ్ చేసిన ఈ సినిమాను నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అమెజాన్‌ వేదికగా ఈ సినిమా తెలుగు వెర్షన్‌ స్ట్రీమింగ్ అవుతోంది. 'బెంగళూరు డేస్' పేరుతో ఈ మూవీ అందుబాటులో వచ్చింది. మలయాళ ఒరిజినల్ వెర్షన్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories