Ban Netflix: నెట్‏ఫ్లిక్స్ ను బ్యాన్ చెయ్యాల్సిందే అంటున్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా?

Ban Netflix Trends Over Navarasa Short Film
x

Ban Netflix: నెట్‏ఫ్లిక్స్ ను బ్యాన్ చెయ్యాల్సిందే అంటున్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా?

Highlights

Ban Netflix: ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన "నవరస" అనే వెబ్ సిరీస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Ban Netflix: ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన "నవరస" అనే వెబ్ సిరీస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టైటిల్కు తగ్గట్టుగానే ఈ సినిమాలో తొమ్మిది కథలు ఉంటాయి. తొమ్మిది మంది దర్శకులు మరియు తొమ్మిది మంది నటులు కలిసి చేసిన ఈ వెబ్ సిరీస్ హాస్యం, కోపం, శోకం మొదలగు తొమ్మిది నవరసాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఈ మధ్యనే నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. అయితే విడుదలైన వెంటనే ఈ వెబ్ సిరీస్ సోషల్ మీడియా లో కలకలం సృష్టించింది. వెబ్ సిరీస్ ను వివాదాలు కోకొల్లలుగా చుట్టుముట్టాయి. ఈ వెబ్ సిరీస్ ముస్లింలకు పవిత్ర గ్రంధమైన ఖురాన్ అవమానించే విధంగా ఉందంటూ చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో అంతేకాకుండా ఇలాంటి ఒక వెబ్ సిరీస్ ని స్ట్రీమ్ చేస్తున్నందుకు ఏకంగా నెట్‏ఫ్లిక్స్ ని బ్యాన్ చేయాలంటూ కొందరు రచ్చ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్లోని ఏడవ ఎపిసోడ్ "ఇన్ మై స్టోరీ" పోస్టర్ ఈ వివాదానికి కారణమైంది. ఆ పోస్టర్ ఖురాన్ ను అవమానించే విధంగా ఉందని కావున తక్షణమే ఈ వెబ్ సిరీస్ ను నిలిపివేయాలని లేదా నెట్ ఫిక్స్ నే పూర్తిగా బహిష్కరించాలని కొందరు పేర్కొంటున్నారు. మతపరంగా మనోభావాలను దెబ్బ తీయడం నేరమని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ సిరీస్ పోస్టర్‍ను మొదట తమిళ వార్త పత్రిక ముద్రించింది. దీంతో అతడిని కూడా శిక్షించాలని కొందరు ఆగ్రహాం వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదాల పై దర్శకుడు మణిరత్నం ఇంకా స్పందించాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories