Balakrishna: బాలయ్య ఫ్యాన్స్‌కి పండగే.. అన్‌స్టాపబుల్ సీజన్‌3కి రంగం సిద్ధం..

Balakrishna unstoppable with NBK 3rd season going to start soon
x

Balakrishna: బాలయ్య ఫ్యాన్స్‌కి పండగే.. అన్‌స్టాపబుల్ సీజన్‌3కి రంగం సిద్ధం.. 

Highlights

అయితే ఇప్పుడు మూడో సీజన్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ అగ్ర కథనాయకుడు బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన టాక్‌ షో అన్‌స్టాపబుల్ విత్‌ ఎన్‌బీకేకు ఎంతటి క్రేజ్‌ దక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన శైలిలో చలోక్తులు, ఫన్నీ డైలాగ్స్‌తో ఈ షోని రక్తి కట్టించారు బాలయ్య బాబు. అగ్ర హీరోలు, దర్శకులు హాజరైన ఈ టాక్‌ షోకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తొలి తెలుగు ఓటీటీ ఆహాలో ఇప్పటికే అన్‌స్టాపబుల్‌కు సంబంధించి రెండు సీజన్‌లు విజయవంతంగా పూర్తైన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు మూడో సీజన్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే మూడో సీజన్‌కు రడీ అవుతున్నారు బాలకృష్ణ. ఈసారి మరింత రెట్టించిన ఉత్సాహంతో, ఆకట్టుకునే కంటెంట్‌తో ఈ సీజన్‌ ఉండనుందని మేకర్స్ చెబుతున్నారు. సీజన్‌ 1,2లో పవన్‌ కల్యాణ్‌, మహేశ్ బాబు, ప్రభాస్‌ లాంటి స్టార్‌ హీరోలతో సందడి చేసిన బాలయ్య మూడో సీజన్‌తో కూడా స్టార్ సెలబ్రిటీలతో వినోదాన్ని అందించేందుకు సిద్దమవుతున్నారని సమాచారం.

మూడో సీజన్‌లో ఫస్ట్ ఎపిసోడ్‌లో అతిథిగా మాలీవుడ్ స్టార్ యాక్టర్‌ దుల్కర్ సల్మాన్ హాజరుకానున్నాడని సమాచారం. లక్కీ భాస్కర్‌ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ షోలో పాల్గొనబోతున్నారని టాక్‌. డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత సూర్య దేవర నాగవంశి కూడా షోలో జాయిన్ కాబోతున్నారట. బాలకృష్ణ అండ్ టీంపై వచ్చే ఈ ఎపిసోడ్‌ను చిత్రీకరణ కూడా పూర్తయిందని సమాచారం. దసరా కానుకగా సీజన్‌ 3 ఫస్ట్ ఎపిసోడ్‌ విడుదల కానున్నట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories