Nandamuri Fans: బాలయ్య ఫ్యాన్స్ అంటే మినిమం ఉంటది.. జస్ట్ స్టిల్‌కే భారీ కటౌట్లు..!

Nandamuri Fans
x

Nandamuri Fans

Highlights

Nandamuri Fans: బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా స్టిల్ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.

Nandamuri Fans: టాలీవుడ్‌లో ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హీరోకి కటౌట్లు పెట్టి పూలదండలు వేసి నానా హంగమా చేస్తుంటారు. ఒకప్పుడు కటౌట్లు అంటే సినిమా రిలీజ్ టైమ్‌లోనే కనిపించేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. టీజర్లు, ట్రైలర్లు, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్న ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అభిమాన హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉంటే కటౌట్లు కామన్‌గా మారాయి. ఈ కల్చర్ పళ్లెటూళ్లో మరీ ఎక్కువైందనే చెప్పాలి.

అయితే ఇప్పుడు తాజాగా వీటన్నింటి మించి ఓ హీరో డెబ్యూ మూవీ స్టిల్ రిలీజ్ కాగానే భారీ కటౌట్లు వెలిశాయి. ఇలాంటి హంగామా జరగడం ఇదే ఫస్ట్ టైమ్ అని టాక్ వినిపిస్తుంది. ఆ క్రిడెట్ ఎవరికో కాదు నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞకే దక్కింది. విచిత్రం ఏమిటంటే ఈ సినిమాకు ఇంకా పేరు కూడా పెట్టలేదు. జస్ట్ స్టిల్ రిలీజ్ చేశారు అంతే.. దీంతో లేట్ చేయకుండా నందమూరి అభిమానులు భారీ కటౌట్లు కట్టి దండలు వేసి హైప్ క్రియేట్ చేశారు.

హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. నందమూరి వారసుడిని టాలీవుడ్‌కి హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాలో మరో ట్విస్ట్ ఎంటంటే బాలయ్య కూడా గెస్ట్ రోల్‌లో కనిపిస్తాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవదులు లేకుండా పోయింది. ఇక్కడ ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేసే మరో విషయం ఏమిటంటే.. జూనియర్ ఎన్టీఆర్, మోక్షుకి వెల్కమ్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశారు.

దీంతో అటు బాలయ్య, ఇటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మరింత సంబరపడిపోతున్నారు. కొన్ని సంవత్సరాలుగా బాబాయ్ బాలయ్యాకి, కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య మాటలు లేవనే పూకార్లు ఉన్నాయి. ఏపీ ఎన్నికల సమయంలో హరికృష్ణ వారసులిద్దరూ టీటీపీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అటు బాబాయ్‌కి మద్దతుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా చేయలేదు. తాజాగా ఎన్టీఆర్ ట్వీట్‌తో ఆ అనుమానాలన్నింటికి ఫుల్ స్టాప్ పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories