Akhanda 2: అఖండ 2 తాండవం షురూ.. క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించిన నారా బ్రాహ్మణి

Akhanda 2
x

Akhanda 2

Highlights

Akhanda 2: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న నాలుగో సినిమా అఖండ 2 తాండవం సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు జరిగాయి. చాలా రోజులుగా అభిమానులు ఎదురుచూస్తున్న అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.

Akhanda 2: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న నాలుగో సినిమా అఖండ 2 తాండవం సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు జరిగాయి. చాలా రోజులుగా అభిమానులు ఎదురుచూస్తున్న అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. వరుసగా హ్యాట్రిక్ హిట్లతో జోరు మీదున్న బాలయ్యకు అఖండ తాండవం డబల్ హ్యాట్రిక్ సాధించేందుకు కీలకం అవుతుంది అని అభిమానులు చెప్తున్నారు.


అఖండ తాండవం సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి బాలకృష్ణ కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు ఆయన కుమార్తెలు తేజస్విని నారా బ్రాహ్మణి ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఇక ఈ సినిమా ముహూర్తం క్లాప్ నారా బ్రాహ్మణి కొట్టడం విశేషం. ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.


మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించనున్నారు. తమన్ కాంబినేషన్లో బాలయ్య ఇప్పటికే వరుసగా మూడు సినిమాలు నటించారు. అఖండ 2 తాండవం థీమ్ మ్యూజిక్ ని ఈ సందర్భంగా వినిపించారు. ఇందులో తమన్ మొదటి పార్ట్ కన్నా కూడా మరింత ఎక్కువ పవర్ తో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వినిపించారు. దీంతో అభిమానులు సందడి చేసుకున్నారు.

ఇదిలా ఉంటే బాలయ్య బోయపాటి కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి ఈసారి అఖండ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న అఖండ తాండవం పైన ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి.


ఈ సీక్వెల్ పార్టీలో కథ ఎలా ఉంటుంది అనే దానిపైన సర్వత్ర చర్చ నడుస్తోంది. కరోనా మహమ్మారి లాక్ డౌన్ అనంతరం విడుదలైన మొదటి సినిమా అఖండ అప్పట్లో ఈ సినిమా ఖాళీగా ఉన్న థియేటర్లను అభిమానులతో హోరెత్తించింది. ప్రేక్షకులు అసలు థియేటర్లకు వస్తారా రారా అని ఇండస్ట్రీ మొత్తం ఆందోళన పడుతున్న వేళ బాలయ్య అఖండ సినిమాతో 2021 డిసెంబర్ రెండవ తేదీన థియేటర్లలోకి ప్రవేశించి అఖండ విజయాన్ని అందుకుంది.


కరోనా మహమ్మారి భయంతో జనం థియేటర్లకు రారు అనే అపోహను పటాపంచలు చేసింది. 50% సీట్ ఆక్యుపెన్సితోనే అఖండ సినిమా దాదాపు 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ప్రస్తుతం అఖండ 2 తాండవం సినిమా ఫ్యాన్ ఇండియా సినిమాగా వస్తోంది తెలుగు, హిందీ తమిళం కన్నడం మలయాళం భాషల్లో ఒకేసారి ఈ సినిమాని విడుదల చేయనున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories