Akhanda Movie Review: బాలకృష్ణ "అఖండ" మూవీ రివ్యూ

Balakrishna Akhanda Movie Review Today 02 12 2021
x

 "అఖండ" మూవీ రివ్యూ

Highlights

* తన మాస్ నటనతో ఫ్యాన్స్ కి పూనకలు తెప్పించిన బాలయ్య

Akhanda Movie Review: నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన సినిమా "అఖండ". సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రూపొందిన ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ పై తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచ‌నాలతో డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చిత్రం : అఖండ

నటీ నటులు: బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, జగపతి బాబు, సుబ్బరాజు తదితరులు

సంగీతం : తమన్

సినిమాటోగ్రఫీ : రామ్ ప్రసాద్

నిర్మాత : మిర్యాల రవీందర్ రెడ్డి

దర్శకత్వం: బోయపాటి శ్రీను

విడుదల తేది : 02/12/2021

కథ:

పోలీసులు, ఓ కరుడు గట్టిన క్రిమినల్ మధ్య జరుగుతున్న సన్నివేశాలతో చిత్రం ప్రారంభమవుతుంది. ఆ వెంటనే కథ రాయలసీమ ప్రాంతానికి షిఫ్ట్ అవుతుంది. మురళికృష్ణ (బాల‌య్య) ఓ ఊరికి పెద్దగా ఉంటూ.. ఎక్కడ అన్యాయం జ‌రిగినా అడ్డుకుంటూ పేదలకు అండగా ఉంటుంటారు. జిల్లా కలెక్టర్ గా ఆ ప్రాంతానికి వచ్చిన శరణ్య (ప్రగ్యా జైస్వాల్) అణగారిన వర్గాలకు జరుగుతున్న ఆ అన్యాయాలపై చర్యలు తీసుకుంటారు. ఈ క్రమంలో ఆమె మురళికృష్ణని ప్రేమించి పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని మొదలుపెడుతారు. అదే ఊరిలో వరదరాజులు(శ్రీకాంత్) అక్రమంగా మైనింగ్ జరుపుతూ ఉంటాడు.

ఈ విషయం తెలుసుకున్న మురళి కృష్ణ.. వరదరాజులును అడ్డుకోవడంతో మురళి కృష్ణను ఎలాగైనా పక్కకు తప్పించాలని వరదరాజులు పన్నాగం పన్ని అతడిని ఓ తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపుతాడు. ఇలా మురళి కృష్ణ కుటుంబానికి వరదరాజులు ద్వారా పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. ఇలా మొదటి అర్ధభాగం సాగిపోతుండగా ఇంట‌ర్వెల్ కి ముందు ఎవరూ ఊహించ‌ని ట్విస్ట్ తో సెకండాఫ్ పై అభిమానులకు ఆసక్తి రేపుతుంది. సెకండ్ ఆఫ్ లో "అఖండ"గా ఎంట్రీ ఇవ్వడంతో అసలు మురళి కృష్ణ ఎవరు? అఖండ ఎవరు..? వీరిద్దరికీ మధ్య సంబంధం ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే..!!

నటీనటులు:

బాలకృష్ణ తన నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. మురళికృష్ణ, అఖండ.. రెండు పాత్రల్లోనూ బాలకృష్ణ న‌ట విశ్వ‌రూపం చూపించారు. బాలయ్య సాంగ్ స్టెప్పులు ప్రేక్షకులను సీట్లలో కూర్చోనివ్వవు. విల‌న్ గా శ్రీకాంత్ నటన సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ప్రగ్యా జైస్వాల్ అందంతో పాటు తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఋషి పాత్రలో జగపతిబాబు, పూర్ణ, సుబ్బరాజు తమ నటనతో ఫర్వాలేదనిపించారు.

సాంకేతిక వర్గం:

బోయపాటి శ్రీను బాలయ్య అఘోర పాత్రతో పాటు శ్రీకాంత్ - బాలయ్య మధ్య వాచే ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. మరోపక్క త‌మ‌న్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో థియేట‌ర్లు దద్దరిల్లిపోతుంది. సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ తీసిన కొన్ని సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • బాలయ్య "అఘోర" పాత్ర
  • హీరో - విలన్ మధ్య వచ్చే సన్నివేశాలు
  • యాక్షన్ సన్నివేశాలు
  • తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • డైలాగ్స్

మైనస్ పాయింట్స్:

  • ఫస్ట్ ఆఫ్ లో కొన్ని
  • కొన్ని రొటీన్ సన్నివేశాలు

బాటమ్ లైన్: బాలయ్య మాస్ నటనకి థియేటర్లలో అభిమానుల పూనకాలతో "అఖండ" విజయమే

Show Full Article
Print Article
Next Story
More Stories