Ram Nagar Bunny: 'సినిమా మీద నమ్మకంతోనే అలా అన్నాను'.. ఆటిట్యూడ్‌ స్టార్‌ చంద్రహాస్‌..

Ram Nagar Bunny: సినిమా మీద నమ్మకంతోనే అలా అన్నాను.. ఆటిట్యూడ్‌ స్టార్‌ చంద్రహాస్‌..
x

Ram Nagar Bunny: 'సినిమా మీద నమ్మకంతోనే అలా అన్నాను'.. ఆటిట్యూడ్‌ స్టార్‌ చంద్రహాస్‌..

Highlights

ఆటిట్యూడ్ స్టార్‌ చంద్రహాస్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం 'రామ్‌ నగర్ బన్నీ'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్‌ 4వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.

Ram Nagar Bunny: ఆటిట్యూడ్ స్టార్‌ చంద్రహాస్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం 'రామ్‌ నగర్ బన్నీ'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్‌ 4వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా హీరో చంద్రహాస్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో.. సినిమా చూసి నచ్చకపోతే టికెట్ ఫొటోతో ఇన్‌స్టా ద్వారా చెప్తే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పానని, సినిమాపై ఉన్న నమ్మకంతోనే అలా అన్నానని చంద్రహాష్‌ తెలిపారు. ఇక రామ్ గోపాల్ వర్మ గారు తన గురించి హీరో క్వాలిటీస్ అన్నీ ఉన్నాయని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. చంద్రహాస్‌ ఇంకా మాట్లాడుతూ.. 'రామ్ నగర్ బన్నీ సినిమా కంప్లీట్ ఎంటర్ టైనర్. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా నా డెబ్యూ మూవీ కావడం సంతోషంగా ఉంది. ఇలాంటి ఎంట్రీ మరొకరికి దొరుకుందని అనుకోను. మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్ కు వస్తోంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎగ్జైటింగ్ గా ఉన్నాను. అయితే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందనే కాన్ఫిడెన్స్ మా టీమ్ అందరిలో ఉంది' అని చెప్పుకొచ్చారు.

"రామ్ నగర్ బన్నీ" సినిమాను సకుటుంబంగా ఫ్యామిలీ ఆడియెన్స్ వెళ్లి చూడొచ్చన్నారు చంద్రహాస్‌. "రామ్ నగర్ బన్నీ" సినిమాను మా నాన్నగారు ప్రభాకర్ ప్రొడ్యూస్ చేశారని, ముందు నేను వద్దనే అన్నానని, ప్రొడక్షన్ రిస్క్ ఉంటుందన్నారు. అయితే ఈ కథను మనం అనుకున్నట్లు బాగా చేయాలంటే మనమే ప్రొడ్యూస్ చేయాలని నాన్న ముందుకొచ్చారు. నాన్న ఈ సినిమాలో ఓ చిన్న రోల్ చేశారు. ఆ టైమ్ కు ఆర్టిస్టు అందుబాటులో లేకుంటే నేనే చేస్తా అని నాన్న అన్నారని చెప్పుకొచ్చారు.

'దర్శకుడు శ్రీనివాస్ మహత్ నన్ను స్క్రీన్ మీద బాగా ప్రెజెంట్ చేశాడు. ఫైట్స్, డ్యాన్స్, లవ్, ఎమోషన్, రొమాంటిక్ ఇలా..అన్ని షేడ్స్ లో నన్ను చూపించారు. ఈ సినిమా తర్వాత నేను అన్ని ఎమోషన్స్, అన్ని జానర్స్ చేయగలను అనే పేరొస్తుంది. ఆటిట్యూడ్ స్టార్ అనేది నేను పెట్టుకున్నది కాదు. "రామ్ నగర్ బన్నీ" సినిమా చూశాక నేను ఆ ట్యాగ్ కు అర్హుడిని కాదు అంటే తీసేస్తా' అని చంద్రహాస్‌ చెప్పుకొచ్చారు. మరి తొలి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్న చంద్రహాస్‌ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories