AR Rahman: విడాకుల విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన రెహమాన్..ఏమన్నారంటే?

AR Rahman: విడాకుల విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన రెహమాన్..ఏమన్నారంటే?
x
Highlights

AR Rahman: దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరూ ఊహించని ప్రకటన చేశారు. ఎన్నో ప్రేమగీతాలకు సంగీతం సమకూర్చి...

AR Rahman: దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరూ ఊహించని ప్రకటన చేశారు. ఎన్నో ప్రేమగీతాలకు సంగీతం సమకూర్చి ప్రేమికులు ఒక్కటయ్యేందుకు తనవంత పాత్ర పోషించిన రెహమాన్ వైవాహిక జీవితంలో విషాద గీతికలు కూడా వినిపిస్తున్నాయి. 29సంవత్సరాల దాంప్యత బంధానికి ముగింపు పలుకుతూ భార్య సైరా బానుతో విడిపోతున్నట్లు రెహమాన్ ప్రకటించారు.

1995 మార్చిలో సైరాబాను, రెహమాన్ వివాహం జరిగింది. మరికొద్దిరోజుల్లో 30వ వివాహ వార్షికోత్సవం జరుపుకోనుంది ఈ జంట. ఇప్పుడు విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మ్యుచువల్ అండర్ స్టాండింగ్ తోనే వీరిద్దరూ విడిపోతున్నారు. సైరాబాను, రెహమాన్ విడాకుల విషయాన్ని సైరా బాను తరపు లాయర్ వందనా షా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.

వివాహం చేసుకున్న 29ఏళ్ల తర్వాత సైరా, ఆమె భర్త రెహమాన్ తో విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. దంపతులిద్దరూ ఒకరి పట్ల మరొకరికి అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు, ఇబ్బందుల నేపథ్యంలో వారి మధ్య పూడ్చలేనంత దూరం పెరిగిపోయింది. దీంతో ఎంతో బాధాకరమైనప్పటికీ విడిపోవాలని సైరా, రెహమాన్ నిర్ణయించుకున్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో తమను అర్థం చేసుకోవాలని వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని సైరా, రెహమాన్ కోరుతున్నారని లాయర్ వందనా షా పేర్కొన్నారు.

ఏఆర్ రెహమాన్, సైరా బానులది పెద్దలు కుదిర్చిన పెళ్లి. 1995 మార్చి 12న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. తల్లిదండ్రుల విడాకుల నేపథ్యంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలంటూ రెహమాన్ కుమారుడు అమీన్ ఇన్ స్టాగ్రామ్ పోస్టు చేశారు.


అటు విడాకుల విషయంలో రెహమాన్ కూడా స్పందించారు. మేము 30ఏళ్ల వివాహ వార్షికోత్సవం చేసుకోవాలని కోరుకున్నాము కానీ అనుకోని రీతిలో ముగింపు పలకాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో సున్నితమైన పరిస్ధితులను ఎదుర్కొంటున్న తరుణంలో తమ పరిస్థితిని అర్థం చేసుకుని వ్యక్తిగత గోప్యతను గౌరవించిన స్నేహితులకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ పోస్టుకు #arrsairaabreakup అనే హ్యాష్ ట్యాగ్ వాడటంపై కొందరు అసంతృప్తిని వ్యక్తం చేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories