Game Changer: గేమ్ ఛేంజర్ టికెట్ ధరల పెంపునకు ఏపీ సర్కార్ అనుమతి

AP Government Permits To Hike Ticket Rates For Game Changers Cinema
x

Game Changer: గేమ్ ఛేంజర్ టికెట్ ధరల పెంపునకు ఏపీ సర్కార్ అనుమతి

Highlights

ఈ నెల 11 నుంచి 23 వరకు ఐదు షోలకు ఈ ధరలు వర్తిస్తాయి. మరో వైపు సినిమా విడుదల చేసే జనవరి 10న ఆరు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం.

గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాకు టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షో టికెట్ (Benefit Show) ధరను రూ. 600గా నిర్ణయించారు. బెనిఫిట్ షో కాకుండా సాధారణ షోలకు మల్టీప్లెక్స్ లో (Multiplex theatre)టికెట్ ధర రూ. 175, సింగిల్ థియేటర్లలో రూ.135 వరకు ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 11 నుంచి 23 వరకు ఐదు షోలకు ఈ ధరలు వర్తిస్తాయి.

మరో వైపు సినిమా విడుదల చేసే జనవరి 10న ఆరు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు.తమ సినిమాకు టిక్కెట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినందుకు సినీ నిర్మాత దిల్ రాజ్ చెప్పారు.ఇందుకు సహకరించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలోని గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్ , సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన ఈ సినిమాకు ఎస్. శంకర్ (S. Shankar)దర్శకత్వం వహించారు. కియా అడ్వాణీ(Kiara Advani), అంజలి (Anjali) తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా ఇది.తెలంగాణలో మాత్రం టికెట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. దీంతో తెలంగాణలో మాత్రం ఈ సినిమాకు టిక్కెట్ల ధరల పెంపు ఉండకపోవచ్చని చెబుతున్నారు. సంధ్య థియేటర్ లో పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories