RGV: రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

AP Fibernet Serves Notice to Ram Gopal Varma
x

RGV: రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Highlights

రామ్ గోపాల్ వర్మకు (Ram Gopal Varma)ఏపీ ఫైబర్ నెట్ (AP Fibernet) నుంచి శనివారం నోటీసులు పంపారు.

రామ్ గోపాల్ వర్మకు (Ram Gopal Varma)ఏపీ ఫైబర్ నెట్ (AP Fibernet) నుంచి శనివారం నోటీసులు పంపారు. వ్యూహం(Vyooham) సినిమాకు ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లు లబ్ది పొందారని రామ్ గోపాల్ వర్మతో పాటు అప్పటి ఫైబర్ నెట్ ఎండీ సహా ఐదుగురికి నోటీసులు పంపారు.

రూ.2.15 కోట్ల ఒప్పందం చేసుకొని రూ. 1.15 కోట్ల చెల్లింపులపై నోటీసులు ఇచ్చామని ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ జీవీ రెడ్డి చెప్పారు. వ్యూస్ ప్రకారం డబ్బు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని.. వ్యూహం సినిమాకు 1,863 వ్యూస్ మాత్రమే వచ్చాయని ఆయన తెలిపారు.

ఒక్క వ్యూకు రూ. 11 వేల చొప్పున చెల్లించారని జీవీ రెడ్డి చెప్పారు. దీనిపై వివరణ కోరుతూ రామ్ గోపాల్ వర్మకు లీగల్ నోటీసు పంపామన్నారు. లబ్ది పొందిన మొత్తాన్ని 15 రోజులుగా వడ్డీతో సహా కట్టాలని ఆదేశించారు.2024 మార్చిలో వ్యూహం సినిమా విడుదలైంది. ఏపీ ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో తమపై అభ్యంతరకరమైన సన్నివేశాలున్నాయని అప్పట్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోర్టును ఆశ్రయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories