Anil Ravipudi: చిరు నాగ్ కాంబో సెట్ చేస్తున్న అనిల్ రావిపూడి.. ఇక అభిమానులకు పండగే..!

Anil Ravipudi Next Multi-Starrer Movie With Chiranjeevi and Nagarjuna
x

Anil Ravipudi: చిరు నాగ్ కాంబో సెట్ చేస్తున్న అనిల్ రావిపూడి.. ఇక అభిమానులకు పండగే..!

Highlights

Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో‌ మల్టీ స్టారర్ సినిమా తీసేందుకు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో‌ మల్టీ స్టారర్ సినిమా తీసేందుకు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. అయితే ఆ సినిమా చిరంజీవి 156 అవుతుందా.? 157 అవుతుందా..? అన్నది మాత్రం కొద్ది రోజుల్లో తెలియనుంది. ప్రస్తుతం ఆ మూవీ ప్లానింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్టు ప్రచారం నడుస్తోంది. అయితే ఇప్పుడీ స్టోరీ విషయంలో అనిల్ ఓ టర్నింగ్ పాయింట్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ కథను చిరంజీవి, కింగ్ నాగార్జునతో కలిసి చేయాలని ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. కథలో కొన్ని మార్పులు చేసి మల్టిస్టారర్‌గా మార్చవచ్చని అనిల్ భావిస్తున్నట్టు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే చిరంజీవీవి, నాగార్జున అభిమానులకు పండగే అంటున్నారు. వీరిద్దరిని ఒకే ఫ్రేమ్‌లో చూడాలని చిరు-నాగ్ అభిమానులు ఎంతోగానో ఎదురు చూస్తున్నారు. దీంతో అనిల్ రూపంలో వారి అభిమానుల కోరిక తీరబోతున్నట్టు కనిపిస్తోంది.

ఒకేసారి ఇద్దరు హీరోలను ఎలా డీల్ చేయాలో అనిల్ కు బాగా తెలుసు. ఎందుకంటే ఎఫ్-2, ఎఫ్-3 చిత్రాలతో వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన రెండు చిత్రాలు ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. ఎఫ్ సిరీస్ చిత్రాలు కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలతో అనిల్ రావిపూడి ఎలా డీల్ చేస్తారా.. అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories