Sreeleela: శ్రీలీల నాకు చుట్టమే.. తొలిసారి బయటపెట్టిన డైరెక్టర్ అనిల్‌ రావిపూడి

Anil Ravipudi And Sreeleela Both Are Relatives
x

Sreeleela: శ్రీలీల నాకు చుట్టమే.. తొలిసారి బయటపెట్టిన డైరెక్టర్ అనిల్‌ రావిపూడి

Highlights

Sreeleela: శ్రీలీల టాలీవుడ్‌లో వరుస సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌గా మారింది. అలాగే వరుసగా సూపర్ హిట్స్ కూడా అందుకుంటోంది.

Sreeleela: శ్రీలీల టాలీవుడ్‌లో వరుస సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌గా మారింది. అలాగే వరుసగా సూపర్ హిట్స్ కూడా అందుకుంటోంది. దీంతో స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్‌లు కూడా అందుకుంటోంది. శ్రీలీల తన టాలెంట్‌తోపాటు ఇటు డ్యాన్స్‌, అటు నటనతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటోంది. తెలుగు అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. వరుస అవకాశాలతో చాలా బిజీగా ఉంది.

ఓ వైపు యువ హీరోలతో జతకడుతూనే.. మరోవైపు సినీయర్ హీరోల సినిమాల్లోనూ కనిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా హీరో బాలకృష్ణ ప్రధాన పాత్రలో రానున్న 'భగవంత్‌ కేసరి'లో నటించింది. అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో రానున్న ఈ సినిమాలో బాలకృష్ణకు సమానంగా నటించిది. ట్రైలర్‌ చూస్తేనే ఈ విషయం అర్థం అవుతుంది.

కాగా, 'భగవంత్‌ కేసరి'ప్రమోషన్స్‌లో సినిమా యూనిట్ చాలా బిజీగా ఉంది. తాజాగా శ్రీలీల, అనిల్‌ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే, వీరిద్దరి మధ్య రిలేషన్ గురించి కీలక విషయం వెల్లడించారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపుడు తొలిసారి తాను ఎక్కడా చెప్పని విషయాన్ని షేర్ చేసుకున్నాడు.ఈ సందర్భంగా శ్రీలీల ఫ్యామిలీతో తనకున్న బంధుత్వాన్ని చెప్పుకొచ్చాడు. శ్రీలీల అమ్మగారి పేరు డాక్టర్ స్వర్ణ. వాళ్ల సొంతూరు ఒంగోలు దగ్గరలో ఉన్న పొంగులూరు. మా అమ్మమ్మగారి కూడా పొంగులూరు అని అనిల్‌ తెలిపాడు.

'శ్రీలీల తల్లి నాకు చెల్లి వరుస అవుతుంది. ఇలా శ్రీలీల తనకు కోడలు అవుతుంది. అయితే, భగవంత్ కేసరి సెట్స్‌లో అందరి ముందూ డైరెక్టర్ గారు అని పిలిచేది. సెట్‌లో ఎవరూ లేనప్పుడు 'మామయ్య' అంటూ పిలిచేది. శ్రీలీల ఇక్కడే పుట్టినా.. పెరిగింది, చదువు అంతా బెంగళూరు, అమెరికాలో జరిగింది. అయితే, ప్రతి ఏటా తన అమ్మమ్మ ఊరికి వస్తూనే ఉంటుంది' అంటూ అనిల్‌ చెప్పుకొచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories