అఖిల్ వద్దు ఈ బొంబాయి ప్రియుడే నాకు ముద్దు.. ఇంతకీ ఈ బొంబాయి ప్రియుడు ఎవరంటే..?

Anchor VishnuPriya Wants To Marry JD Chakravarthy
x

Anchor VishnuPriya: ఆంటీ ఒప్పుకుంటే ఆ హీరోతోనే జీవితం.. అఖిల్ అంటే పిచ్చి అంతే..!

Highlights

VishnuPriya: యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు.

VishnuPriya: యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. మొదటిసారిగా పోవే పోరా షోతో బుల్లితెరపై అడుగుపెట్టిన విష్ణు ప్రియ తన మాటలతో గ్లామర్ తో యూత్ ని బాగానే అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత పలు టీవీ షోలు, ప్రత్యేక కార్యక్రమాల్లో కనిపించిన విష్ణు ప్రియ ఈ మధ్య గంగులు అనే పాటకు డ్యాన్స్ చేసి చాలా క్రేజ్ సంపాదించుకుంది.

విష్ణు ప్రియ ప్రస్తుతం పలు రకాల వీడియోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ ని పెంచుకుంటోంది. ఈ బ్యూటీ తాజాగా సిక్త్ సెన్స్ సీజన్ ఫైవ్ కి గెస్ట్ గా హాజరు అయింది. యాంకర్ రవితో కలిసి సిక్త్ సెన్స్ షోకి వచ్చిన విష్ణుప్రియకు ఓంకార్ పలు టాస్కులు ఇచ్చాడు. ఎంతో సందడిగా ఆడిన విష్ణు ప్రియ బైక్ కూడా గెల్చుకుంది. ఇక ఎగ్స్ పగలకొట్టేటప్పుడు ఓంకార్ ఓ విషయం అడగగా..విష్ణు ప్రియ చెప్పిన సమాధానం అందర్ని షాక్ కు గురి చేసింది. ముఖ్యంగా విష్ణు ప్రియ ఫ్యాన్స్ అయితే ఇదేం టేస్ట్ రా బాబు అంటూ చాలా హర్ట్ అయ్యారు కూడా.

విష్ణు ప్రియను ఓంకార్ మీరు ఎవరైనా సెలబ్రిటీతో క్రష్ లో ఉన్నారా అని అడిగాడు. ఓంకార్ అడిగిందే తడవుగా విష్ణు ప్రియా సెకండ్ థాట్ లేకుండా బొంబాయి ప్రియుడు ఫేం జేడీ. చక్రవర్తి పేరుని ఠక్కున చెప్పేసింది. ఈ ఆన్సర్ కి కాస్త షాక్ తిన్న ఓంకార్..ఎందుకు నీకు ఆయనంటే అంత ఇష్టం అని అడిగాడు. జేడీ చక్రవర్తితో కలిసి ఒక వెబ్ సిరీస్ చేశానని..ఆ టైమ్ లో అతనితో ట్రావెల్ చేశానిని..అప్పుడే ఆయన మంచి మనసు తనకు అర్థమయిందంటూ విష్ణు ప్రియ చెప్పుకొచ్చింది. 40 రోజుల ఆ జర్నీలో పదవ రోజే ఆయనతో ప్రేమలో పడిపోయానని చెప్పింది. అంతేకాదు, ఆంటీ ఒప్పుకుంటే జేడీ ఇంటికి కోడలిగా వెళ్లిపోతానని...ఆయనతోనే తన జీవితమని తెలిపింది. విష్ణు ప్రియ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

జేడీ చక్రవర్తికి 2016లోనే నటి అనుకృతితో వివాహం జరిగింది. ఇదిలాఉంటే, గతంలో అక్కినేని అఖిల్ పై ప్రేమను చాటుకున్న విష్ణుప్రియ, అఖిల్ తో ఒక్క ఛాన్స్ కావాలని దర్శకులను రిక్వెస్ట్ చేసిన విష్ణు ప్రియ.. ఇప్పుడు సడెన్ గా జేడీ చక్రవర్తి జపం మొదలు పెట్టడంతో వీరిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుందని పలువురు ఆరా తీస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories