జీఎస్టీ దాడులుపె జరిగాయనే వార్తపై ప్రముఖ యాంకర్ సుమ స్పందించారు. ఈ వార్తలను యాంకర్ సుమ ఖండించారు.
జీఎస్టీ దాడులుపె జరిగాయనే వార్తపై ప్రముఖ యాంకర్ సుమ స్పందించారు. ఈ వార్తలను యాంకర్ సుమ ఖండించారు. తాను జీఎస్టీ చెల్లిస్తున్నానని చేస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ.. సుమ ఇంట్లో జీఎస్టీ సోదాలు జరిగాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. కొన్ని పత్రికలు చానెల్లో మాత్రమే ఇవన్ని పుకార్లు సృష్టించాయని వ్యాఖ్యానించారు. నేను జీఎస్టీ కట్టలేదని వార్తల్లో నిజం లేదు. నేను నిజాయితీగా జీఎస్టీ కడుతున్నాను, నా దర్గర అన్ని అన్ని రికార్డులు ఉన్నాయి. ప్రతి సారి పుకార్లు వస్తున్నాయి. ప్రముఖులపై ఇలాంటి గాసిప్స్ తరచూ వస్తున్నాయి. అయితే ఈ సారి ఇలాంటి వార్తలను ఖండించాల్సిన అవసరం ఉందని సుమ తన ట్విటర్ లో వెల్లడించారు.
అయితే టాలీవుడ్ సెలబ్రిటీలకు జీఎస్టీ సెగ తగిలింది. ఇద్దరు ప్రముఖ యాంకర్లతోపాటు ఓ హీరోయిన్ ఇంట్లో జీఎస్టీ నిఘా విభాగం బృందాలు తనిఖీ చేపట్టాయి. ఒక్క టాలీవుడ్ పైనే కాదు రియల్ ఎస్టేట్, సినిమా, మీడియా, చిట్‌ఫండ్, సాఫ్ట్ వేర్ కంపెనీలు, నిర్మాణ సంస్థలకు చెందిన కొన్ని కార్యాలయాల్లో ఏకకాలంలో 23 చోట్ల తనిఖీలు చేశారు. కోట్ల రూపాయల్లో సర్వీస్ ట్యాక్స్, జీఎస్టీ ఎగవేసినట్టు పలు సంస్థలు, వ్యక్తులపై ఆరోపణలున్న నేపథ్యంలో సోదాలు చేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి.
జూబ్లీహిల్స్‌లోని లావణ్య త్రిపాఠి ఇంట్లో సోదాలు జరిగాయి. వెంటనే విషయం తెలుసుకున్న ఆమె సినిమా షూటింగ్‌ను రద్దు చేసుకుని ఇంటికి వెళ్లారు. మణికొండలోని యాంకర్ సుమ కనకాల, బంజారాహిల్స్‌లోని అనుసూయ ఇళ్లలో అధికారులు సోదాలు చేశారు. దాడులు చేసిన కొన్ని సంస్థల్లో లావణ్య త్రిపాఠి, అనుసూయ పెట్టుబడులు పెట్టారని, ఆ సంస్థల నిర్వాహకులు సర్వీస్ ట్యాక్స్, జీఎస్‌టీ ఎగ్గొట్టారనే అనుమానాలు వ్యక్తం చేసిన అధికారులు. వారి ఇళ్లలో సోదాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే యాంకర్ సుమా ఈ వార్తలను ఖండించారు.
There is a news that gst raids have happened in my house . Which house ? Where? I have been a prompt payer of gst. I have worked hard to reach this position. Why don't some newspapers and channels check the authenticity before posting such rubbish about me. #behuman#beresponsible pic.twitter.com/h7GJLzhDLJ
— Suma Kanakala (@ItsSumaKanakala) December 22, 2019
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire