Anchor Suma: షోలో కన్నీళ్లు పెట్టుకుంటూ.. యాంకరింగ్ కి విరామం ప్రకటించిన సుమ..

Anchor Suma Gets Emotional Over Quitting Anchoring For Some Days
x

Anchor Suma: షోలో కన్నీళ్లు పెట్టుకుంటూ.. యాంకరింగ్ కి విరామం ప్రకటించిన సుమ..

Highlights

* నేను మలయాళీ అయినా తెలుగు ప్రేక్షకులు నన్ను గుండెల్లో పెట్టుకొని ప్రేమించారు అంటూ సుమ ఎమోషనల్ అయింది

Anchor Suma: ప్రముఖ యాంకర్ సుమ గురించి తెలియని వారు ఉండరు. గత 15 ఏళ్లుగా బుల్లితెరను ఏలుతున్న యాంకర్ సుమ. స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ప్రముఖ టాక్ షో ల వరకు ఎటు చూసినా సుమ కనిపిస్తూనే ఉంటుంది. ఈ మధ్యనే "జయమ్మ పంచాయతీ" సినిమాతో ఒక నటిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆ సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. ఏదేమైనా సుమ పై ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.

ఇప్పటికీ స్టార్ హీరోల సినిమా అంటే సుమ ఉండాల్సిందే. ఆమె టైమింగ్ మరియు కామెడీ ఇంకా ఎవరూ చేయలేరు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుమ ఒక షాకింగ్ వార్తను చెప్పింది. ఇక పై యాంకరింగ్ నుండి బ్రేక్ అని ప్రకటించి సుమ షాక్ ఇచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా ప్రసారం కానున్న ఒక షోలో సుమ ఈ మాటలను చెప్పారు.

"నేను మలయాళీ అయినా తెలుగు ప్రేక్షకులు నన్ను గుండెల్లో పెట్టుకొని ప్రేమించారు" అంటూ సుమ ఎమోషనల్ అయింది. తన అభిమానుల ప్రేమ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న సుమ కొంతకాలం యాంకరింగ్ నుంచి విరామం తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. దీంతో మిగతా ఆర్టిస్టులు అందరూ ఆమెకు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అభిమానులు మాత్రం ఈ డిసెంబర్ 31 నుంచి యాంకరింగ్ కు బ్రేక్ ఇచ్చి సుమ వచ్చే ఎడాది జనవరి ఫస్ట్ నుంచి మాత్రమే యాంకరింగ్ కొనసాగిస్తుందని నెటిజన్లు కౌంటర్ పోస్టులు చేస్తున్నారు. ఇందులో నిజా నిజాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories