నాకోసం వరుణ్ణి వెతికేందుకు థాంక్యూ అంటున్నా పవన్ కళ్యాణ్ హీరోయిన్

Ananya Nagalla Reacts to Marriage Rumours | Tollywood
x

 నాకోసం వరుణ్ణి వెతికేందుకు థాంక్యూ అంటున్నా పవన్ కళ్యాణ్ హీరోయిన్

Highlights

*పెళ్లి పుకార్లపై సరదాగా రియాక్ట్ అయిన అనన్య నాగళ్ళ

Ananya Nagalla: గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "వకీల్ సాబ్" సినిమాలో కనిపించిన అనన్య నాగళ్ళ త్వరలోనే సినిమాలకి స్వస్తి చెప్పి వివాహం చేసుకొని సెటిల్ అవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత రెండవ తనయుడితో అనన్య వివాహం సెట్ అయిందని వారిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పెళ్లి తర్వాత ఆమె సినిమాలకి గుడ్ బై చెప్పబోతోంది అని కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి. తాజాగా సోషల్ మీడియా ద్వారా ఈ పుకార్లపై సరదాగా రియాక్ట్ అయింది ఈ భామ.

"గైస్.. నాకోసం ఒక వరుణ్ణి వెతికి పెట్టినందుకు చాలా థాంక్స్. కానీ అతను ఎవరో నాకు కూడా చెప్పండి ప్లీజ్. పెళ్లి డేట్ మరియు సమయం కూడా చెప్తే నా పెళ్ళికి నేను హాజరవుతాను," అని వ్యంగ్యంగా రియాక్ట్ అయింది అనన్య. ఇలా ఒక్క ట్వీట్ తో తన పెళ్లిపై వస్తున్న పుకార్లలో నిజం లేదని తెలిసి చెప్పింది ఈ భామ. అయితే ఈమె సింగిలా లేక ఎవరితోనైనా రిలేషన్ షిప్ లో ఉందా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే అనన్య నాగళ్ళ సమంత హీరోయిన్ గా నటిస్తున్న "శాకుంతలం" సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. గుణశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు అనన్య సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోషూట్లతో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories