Amitabh Bachchan Discharged From Hospital : బాలీవుడ్ లో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్
Amitabh Bachchan Discharged From Hospital : బాలీవుడ్ లో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం కోరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక వీరంతా ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇందులో ఐశ్వర్యరాయ్, ఆరాధ్య త్వరగానే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు (ఆగస్టు 2న) అమితాబ్ బచ్చన్‌కు కొవిడ్ నెగిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే తనకి మాత్రం పాజిటివ్ వచ్చినట్టుగా అభిషేక్ బచ్చన్ స్పష్టం చేశారు.
"తాజాగా జరిపిన కొవిడ్-19 పరీక్షలో మా నాన్నకు నెగిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం అయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంట్లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటారు. ఆయన కోలుకోవాలని కోరుకున్న, ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు" అని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా దురదృష్టవశాత్తు నాకు మళ్లీ కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం నేను హాస్పిటల్‌లోనే ఉన్నానని, నేను ఈ కరోనాను నేను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాను ప్రామిస్ " అని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఇక అటు అభిమానులు కూడా అభిషేక్ కోలుకోవాలని కోరుకుంటున్నారు.
🙏🏽 my father, thankfully, has tested negative on his latest Covid-19 test and has been discharged from the hospital. He will now be at home and rest. Thank you all for all your prayers and wishes for him. 🙏🏽
— Abhishek Bachchan (@juniorbachchan) August 2, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire