Amitabh Bachchan: అవన్నీ ఫేక్‌ న్యూస్‌ అంటూ క్లారిటీ ఇచ్చిన అమితాబ్‌ బచ్చన్‌

Amitabh Bachchan Quashes Rumours of Undergoing Angioplasty
x

Amitabh Bachchan: అవన్నీ ఫేక్‌ న్యూస్‌ అంటూ క్లారిటీ ఇచ్చిన అమితాబ్‌ బచ్చన్‌

Highlights

Amitabh Bachchan: తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్‌ అని బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ స్పష్టం చేశారు.

Amitabh Bachchan: తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్‌ అని బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ స్పష్టం చేశారు. ఆయన అస్వస్థతకు గురైనట్లు మార్చి 15న సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ముంబయిలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చేరారని.. యాంజియోప్లాస్టీ చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బిగ్ బి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఆయన బహిరంగ ప్రదేశంలో కనిపించారు.

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యారు. థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో మాఝీ ముంబయి, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌కు కుమారుడితో అమితాబ్‌ హాజరయ్యారు. మ్యాచ్‌ చూసేందుకు వెళ్లిన ఆయన్ను ఆరోగ్యం గురించి మీడియా వారు ప్రశ్నించగా... అందులో నిజం లేదని, ఆ వార్తలు ఫేక్‌ అని తెలిపారు. దీంతో ఆయన ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు. అమితాబ్‌ ఐఎస్‌పీఎల్‌ ఫైనల్స్‌లో హుషారుగా పాల్గొని సందడి చేశారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌తో కలిసి మ్యాచ్‌ను వీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఎక్స్‌లో షేర్‌ అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories