KBC 16: 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి'లో పవన్‌ కళ్యాణ్‌పై ప్రశ్న.. రూ. 1.60 లక్షల ఆ ప్రశ్న ఏంటంటే..?

Amitabh Asked Question About Pawan Kalyan in Kaun Banega Crorepati Show
x

KBC 16: 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి'లో పవన్‌ కళ్యాణ్‌పై ప్రశ్న.. రూ. 1.60 లక్షల ఆ ప్రశ్న ఏంటంటే..?

Highlights

Kaun Banega Crorepati: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Kaun Banega Crorepati: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్‌ తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. ఇక సినిమాల్లో భారీ క్రేజ్‌ సంపాదించుకున్న పవన్‌ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచారు.

జనసేన పార్టీ తరఫున మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు, రెండు ఎంపీలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా సేవలందిస్తున్నారు పవన్‌. ఈ విజయంతో పవన్‌ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. యావత్‌ దేశాన్ని పవన్‌ తనవైపు తిప్పుకున్నారు. తాజాగా బాలీవుడ్‌ షోలో పవన్‌ ప్రస్తావన రావడం ఆయ క్రేజ్‌ దేశవ్యాప్తంగా ఎలా ఉందో చెప్పకనే చెబుతోంది.

వివరాల్లోకి వెళితే.. బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' 16వ సీజన్‌ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఓ కంటెస్టెంట్‌ను పవన్‌కు సంబంధించిన ప్రశ్నను అడిగారు. ‘2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు?’ అని అడిగారు. కంటెస్టెంట్‌ ఇందుకోసం ఆడియన్స్‌ పోల్‌ ఆప్షన్‌ను తీసుకున్నారు. షోకు హాజరైన 50 శాతం మంది ఆడియన్స్‌ పవన్‌ కల్యాణ్‌ అని చెప్పారు. దీంతో వారు పవన్‌ పేరు చెప్పి లాక్‌ చేశారు. అది సరైన సమాధానం కావడంతో కంటెస్టెంట్‌ రూ.1.60లక్షలు గెలుచుకొని తర్వాత ప్రశ్నకు వెళ్లారు.

దీంతో పవన్‌ అభిమానులు ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరోకు సంబంధించి బాలీవుడ్ ప్రముఖ షోలో ప్రశ్న రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్‌ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ వంటి సినిమాలను పూర్తి చేయనున్నారు. త్వరలోనే ఓజీ షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories