Amaran movie: అమరన్ మూవీ పబ్లిక్ టాక్ ఏంటి?

Amaran movie: అమరన్ మూవీ పబ్లిక్ టాక్ ఏంటి?
x
Highlights

Amaran movie public talk: శివ కార్తీకేయన్ హీరోగా నటించిన అమరన్ మూవీకి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంది. రాజ్ కుమార్ పెరియసామి రూపొందించిన ఈ...

Amaran movie public talk: శివ కార్తీకేయన్ హీరోగా నటించిన అమరన్ మూవీకి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంది. రాజ్ కుమార్ పెరియసామి రూపొందించిన ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించారు. ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ప్రముఖ హీరో కమల్ హాసన్, సినీ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా.. ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ మూవీలో శివకార్తీకేయన్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఇక సాయి పల్లవి ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు రెబెకా జాన్ పాత్రలో నటించింది.

తాజాగా హీరో శివ కార్తీకేయన్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మూవీ టీమ్ ఇటీవల భారత ఆర్మీ సైనికులకు అమరన్ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించింది. ఈ ప్రీమియర్‌కు చాలా మంది సైనికులు హాజరయ్యారు. అయితే అది చూసిన తర్వాత వాళ్లు ఏం చెబుతారోనని తాను కంగారు పడ్డానని.. కానీ వారు చాలా సంతోషంగా ఫీలయ్యారని శివ కార్తికేయన్ తెలిపారు. ఇద్దరు సైనికులు తన దగ్గరకు వచ్చి తనకు ఓ ఆఫర్ ఇచ్చారని చెప్పారు. అదేంటంటే తమతో పాటు ఇండియన్ ఆర్మీలో చేరండి అని అన్నారని.. అది విన్నప్పుడు తాను చాలా సంతోషించారని చెప్పుకొచ్చారు.

2022లో వచ్చిన ప్రిన్స్ పరాజయం తర్వాత హీరో అజిత్ కుమార్ చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు. ప్రిన్స్ పరాజయం తర్వాత సోషల్ మీడియాలో చాలా విమర్శలు వచ్చాయని.. అవి తనను ఎంతో బాధించాయని శివ కార్తికేయన్ అన్నారు. ఆ తర్వాత ఒకసారి తన స్నేహితుడి ఇంటికి వెళ్లిన సమయంలో అక్కడ అజిత్‌ను కలిశానని తెలిపారు. ఆ క్రమంలో ఆయన చెప్పిన మాటలు చాలా ధైర్యాన్నిచ్చాయన్నారు. ప్రతి వ్యక్తి కష్టాలను, నష్టాలను ఎదుర్కొంటాడని.. కానీ వాటిని రహదారి ముగింపుగా చూడడం కంటే.. వాటిని భవిష్యత్తు విజయానికి మార్గం సుగుమం చేసే అభ్యాస అనుభవాలుగా చూడాలని చెప్పారు. విమర్శలను సరిగ్గా అర్దం చేసుకోవాలని తెలిపారన్నారు. మన సినిమా సరిగా లేదని చెబితే తప్పును సరిదిద్దుకోవాలని సూచించారని అన్నారు శివకార్తీకేయన్.

దేశం కోసం ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ చేసిన త్యాగం, ఆయన అసమాన పోరాటాన్ని అమరన్ మూవీలో దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి చక్కగా చూపించాడని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఇందులో రెబెకా జాన్ పాత్రలో సాయిపల్లవి క్యారెక్టర్, యాక్టింగ్ అమరన్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. శివ కార్తీకేయన్, సాయి పల్లవి కాంబోలో వచ్చే ప్రతి సీన్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తుందంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories