Allu Arjun: పవన్ కళ్యాణ్ బాటలో స్నేహా రెడ్డి... 41 రోజుల పాటు కఠోర దీక్ష

Allu Arjun: పవన్ కళ్యాణ్ బాటలో స్నేహా రెడ్డి... 41 రోజుల పాటు కఠోర దీక్ష
x
Highlights

Allu Arjun wife Sneha Reddy to do 41 days fasting for him: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారంరేపింది. ఈ క్రమంలో అల్లు అర్జున్...

Allu Arjun wife Sneha Reddy to do 41 days fasting for him: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారంరేపింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం.. తాత్కాలిక బెయిల్‌ రావడం చకచక జరిగిపోయాయి. అయితే అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని హైకోర్టులో పోలీసులు మరో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో మళ్లీ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సమస్య నుంచి అల్లు అర్జున్ బయట పడాలంటూ తన భార్య స్నేహా రెడ్డి 41 రోజుల పాటు కఠోర దీక్ష చేయనున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం స్నేహారెడ్డి.. పవన్ కళ్యాణ్‌ను ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షను చేశారు. తిరుమలకు నడుచుకుంటూ వచ్చి మరీ దర్శనం చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్‌ సంధ్య థియేటర్ ఘటన నుంచి బయటపడాలంటూ స్నేహా కూడా 41 రోజుల పాటు దీక్ష చేయనున్నట్టు సమాచారం. కేవలం పండ్లు తిని 41 రోజులు ఉపవాసం చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

స్నేహా రెడ్డి తన భర్త కోసం ఉపవాసాలు, ధనుర్మాస పారాయణం కూడా చేయనున్నారని టాక్. ఒక వైపు ధనుర్మాసం నేపథ్యంలో వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళిని రోజు చదవాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత స్నేహరెడ్డి తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారని సమాచారం.

గతంలో ఏపీలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు అయినప్పుడు కూడా స్నేహా తిరుమలకు వెళ్లి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ ఏడుకొండల వాడిపై భారం పెట్టి తన భర్తను గండం నుంచి గట్టెక్కించమని ప్రార్థించనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే సంధ్య థియేటర్‌ను ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పాలని పోలీసులు షోకాజ్ నోటీసులు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories