Allu Arjun speech Video: కళ్యాణ్ బాబాయ్.. థాంక్యూ సో మచ్.. పుష్ప రాజ్ స్పీచ్ వైరల్

Allu Arjun speech Video: కళ్యాణ్ బాబాయ్.. థాంక్యూ సో మచ్.. పుష్ప రాజ్ స్పీచ్ వైరల్
x
Highlights

Allu Arjun speech in Pushpa 2 success meet press meet: పుష్ప 2 మూవీ సక్సెస్ మీట్ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ సినిమాను సక్సెస్ చేసిన ప్రతీ...

Allu Arjun speech in Pushpa 2 success meet press meet: పుష్ప 2 మూవీ సక్సెస్ మీట్ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ సినిమాను సక్సెస్ చేసిన ప్రతీ ఒక్కరికి థాంక్స్ చెప్పాడు. సినిమాను చూసి ఆదరించిన అభిమానులకు, ఆడియెన్స్‌కు థాంక్స్ చెప్పాడు. పుష్ప 2 మూవీ కోసం పనిచేసిన సాంకేతిక నిపుణులను గుర్తుచేసుకున్నారు. తమపై అంత నమ్మకం ఉంచి పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

పుష్ప 2 మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు అటు ఏపీ సర్కారు, ఇటు తెలంగాణ సర్కారు అనుమతి ఇచ్చాయి. అంతేకాకుండా బెనిఫిట్ షోలు కూడా నడిచాయి. ఇదే విషయాన్ని గుర్తుచేసుకుంటూ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అల్లు అర్జున్ థాంక్స్ చెప్పాడు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి సరిసమానంగా తమకు ఏపీ ప్రభుత్వం నుండి కూడా సహకారం లభించిందన్నాడు. పుష్ప 2 మూవీకి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతించిన ఏపీ ప్రభుత్వానికి థాంక్స్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పాడు.

ఈ క్రమంలోనే తమకు ఏపీ ప్రభుత్వం నుండి ఈ సహకారం లభించడంలో కీలకంగా వ్యవహరించిన కళ్యాణ్ బాబాయ్‌కు కూడా థాంక్స్ అని వ్యాఖ్యానించాడు. సరిగ్గా ఇక్కడే అల్లు అర్జున్ మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు.

అల్లు అర్జున్‌కు పవన్ కళ్యాణ్ వరుసకు మామయ్య అవుతాడు. కానీ ఈ స్పీచ్‌లో మాత్రం కళ్యాణ్ బాబాయ్ అని సంభోదించాడు. గతంలోనూ పలు సందర్భాల్లో కళ్యాణ్ అల్లు అర్జున్ ను కళ్యాణ్ అని సంబోధించడాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories