Pushpa 2: పుష్ప2 నుంచి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌.. స్పెషల్‌ సాంగ్‌లో ఆ స్టార్‌ హీరోయిన్‌

Pushpa 2: పుష్ప2 నుంచి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌.. స్పెషల్‌ సాంగ్‌లో ఆ స్టార్‌ హీరోయిన్‌
x
Highlights

Pushpa 2 Movie Item Song: ఒక్క టాలీవుడ్‌ మాత్రమే కాకుండా యావత్ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న చిత్రం పుష్ప2. సుకుమార్‌...

Pushpa 2 Movie Item Song: ఒక్క టాలీవుడ్‌ మాత్రమే కాకుండా యావత్ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న చిత్రం పుష్ప2. సుకుమార్‌ దర్శకత్వంలో, బన్నీ హీరోగా తెరకెక్కిన పుష్ప చిత్రం ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న పుష్ప2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్‌ 6వ తేదీన పుష్ప2 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతోంది.

విడుదల తేదీ దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఇదిలాఉంటే పుష్ప1లో వచ్చిన స్పెషల్ సాంగ్‌ సిమిమాకే హైలెట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సమంత గ్లామర్‌ షో, దేవీశ్రీ మ్యూజిక్‌తో వచ్చిన 'ఊ అంటావా మావా' సాంగ్‌ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

పుష్ప సీక్వెల్‌లో కూడా స్పెషల్ సాంగ్ ఉండనుందని ఇప్పటికే సుకుమార్‌ ప్రకటించారు. ఫస్ట్‌ పార్ట్‌తో పోల్చితే సెకండ్ పార్ట్‌లో స్పెషల్‌ సాంగ్‌ మరింత ఆసక్తిగా ఉండనుందని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఈ స్పెషల్‌ సాంగ్‌లో ఎవరు కనిపించనున్నారన్న విషయాన్ని మాత్రం చిత్ర యూనిట్ ప్రకటించలేదు. దీంతో ఈ సాంగ్‌లో ఎవరు నటించనున్నారన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

గత కొన్ని రోజులుగా ఈ సాంగ్‌లో పలానా హీరోయిన్‌ నటించనుందని వార్తలు వస్తున్నాయి తప్ప. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఆమధ్య దిశా పటానీ పేరు వినిపించింది. అలాగే యానిమల్‌ బ్యూటీ త్రిప్తి డిమ్రి పేరు కూడా వార్తల్లో వినిపించింది. అయితే ఆ తర్వాత ఇవన్నీ పుకార్లేనని తేలింది. కాగా తాజాగా మరో హీరోయిన్‌ పేరు వినిపిస్తోంది. బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ ఈసారి స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనుందని తెలుస్తోంది. ఇటీవలే స్త్రీ2తో సెన్సేషన్‌ విజయాన్ని అందుకున్న శ్రద్ధ అయితే సినిమాకు వెయిటేజ్‌ పెరుగుతుందని భావించిన చిత్ర యూనిట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories