Pushpa 2 Collections: అంచనాలకు మించి పుష్ప2 వసూళ్లు.. ఇప్పటి వరకు కొన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

Allu Arjun Pushpa 2 Movie Collected More Than RS 1500 Crore
x

Pushpa 2 Collections: అంచనాలకు మించి పుష్ప2 వసూళ్లు.. ఇప్పటి వరకు కొన్ని కోట్లు రాబట్టిందో తెలుసా? 

Highlights

Pushpa 2 Collections: భారీ అంచనాల నడుమ విడుదలైన పుష్ప2 అంచనాలకు అనుగుణంగానే దూసుకుపోతోంది.

Pushpa 2 Collections: భారీ అంచనాల నడుమ విడుదలైన పుష్ప2 అంచనాలకు అనుగుణంగానే దూసుకుపోతోంది. అల్లు అర్జున్‌(Allu Arjun) హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని ఊపేస్తోంది. గతంలో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొడుతూ పుష్ప రాజ్‌ జర్నీ కొనసాగుతోంది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు సునామీని సృష్టిస్తోంది. పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందు నుంచే పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

తెలుగుతో పాటు దేశంలో విడుదలైన అన్ని భాషల్లో పుష్ప హంగామా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 1508 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో కేజీయఫ్‌ రూ. 1250 కోట్లు, ట్రిపులార్‌ రూ. 1387 కోట్ల రికార్డులను పుష్ప2 తిరగరాసింది. ఇదిలా ఉంటే బాహుబలి2 రూ. 1810 కోట్లను పుష్ప2 దాటేస్తుందా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఇక హిందీ మార్కెట్లో పుష్ప2(Pushpa 2) సందడి మాములుగా లేదు. నేరుగా హిందీలో ఈ సినిమా ఏకంగా రూ. 618.50 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక ముంబయి సర్క్యూట్‌లో రూ. 200 కోట్ల నెట్‌ సాధించిన తొలి సినిమాగా పుష్ప2 రికార్డు క్రియేట్ చేయడం విశేషం. కాగా పుష్ప2 వసూళ్ల పర్వం ఇలాగే కొనసాగేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. క్రిస్‌మస్‌ వరకు పెద్దగా సినిమాలు ఏవి విడుదల లేకపోవడం కూడా పుష్ప2కి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.

ఇక క్రిస్‌మస్‌ కానుకగా కేవలం బేబీ జాన్‌(Baby John) మూవీ ఒకటే రాబోతోంది. దీంతో క్రిస్మస్‌ హాలీడే సీజన్‌ పుష్ప2కి ప్లస్‌ అయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే పుష్ప2 రూ. 2 వేల కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు సైతం లేకపోలేవని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు భారతీయ చిత్రాల జాబితాలో అమిర్‌ఖాన్‌ హీరోగా నటించిన దంగల్‌ రూ. 2,024 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. మరి పుష్ప2 ఈ రికార్డును తిరగరాసి తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తుందా చూడాలి. కాగా పుష్ప2 చిత్రం కేవలం 6 రోజుల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories