Allu Arjun Birthday: 'గంగోత్రి' లో సింహాద్రి... 'పుష్ప' రాజ్ లా మారిండు

Allu Arjun Birthday Special Story
x

అల్లు అర్జున్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Allu Arjun Birthday: "గంగోత్రి" సినిమాతో తెలుగు తెరకు పరిచమయ్యాడు అల్లు అర్జున్.

Allu Arjun Birthday: "గంగోత్రి" సినిమాతో తెలుగు తెరకు పరిచమయ్యాడు అల్లు అర్జున్. అల్లు అరవింద్ కుమారుడిగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా తొలి అడుగు ప్రారంభించినా.. ప్రతీ సినిమాలో తనకుంటూ ఓ స్టైల్ ను ఫాలోఅవుతూ.. స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకుని, ఓ ట్రెండ్ సెట్ చేశాడు. "ఆర్య" సినిమాతో లవర్ బాయ్ గా అలరించాడు బన్నీ. మాస్ డైలాగ్స్ చెప్పడంలో అల్లు అర్జున్ తరువాతే ఎవరైనా అంటుంటారు ఫ్యాన్స్. "దేశ ముదురు" సినిమాతో బాక్స్ ఫీస్ రికార్డులను క్రియోట్ చేశాడు ఆర్య ఫేం. 'వేదం' , 'రుద్రమదేవి' వంటి మల్టీస్టారర్ సినిమాల్లో నటించి ప్రశంసలు అందుకున్నాడు. అలాగే "సరైనోడు", "సన్నాఫ్ సత్యమూర్తి" వంటి సినిమాలు అల్లు అర్జున్ రేంజ్ ను అమాంతం పెంచేశాయి.

ఇక డాన్స్ అంటే బన్నీకి ప్రాణం. పాటలకు తనదైన స్టెప్పులతో ప్రాణం పోస్తాడు. మెగాస్టార్ "డాడీ" సినిమాలో మెరిసిన అల్లు అర్జున్.. డాన్స్ స్టూడెంట్‌గానే కనిపిస్తాడు. ఇవాళ(8 April) స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్ ను ఓ సారి పరిశీలిద్దాం.


బాల నటుడి గా 1985లో చిరంజీవి నటించిన "విజేత" సినిమాలో నటించాడు. ఆ తర్వాత 1986లో విడుదలైన "స్వాతిముత్యం" సినిమాలో కూడా నటించారు. ఆ సినిమా తర్వాత దాదాపు 15 సంవత్సరాల తర్వాత 2001లో చిరంజీవి నటించిన "డాడీ" సినిమాలో డాన్స్ స్టూడెంట్ గా నటించాడు.

ఇక హీరోగా 2003 లో డైరెక్టర్ రాఘవేంద్రరావు స్పెషల్ మూవీ "గంగోత్రి" తో మొదలు పెట్టాడు అల్లు అర్జున్. ఆ చిత్రంతోనే దర్శకేంద్రుడు తన 100 చిత్రాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ చిత్రం ఘనవిజయం సాధించి, అల్లు అర్జున్ కి ఘనంగా వెల్ కం చెప్పింది టాలీవుడ్.


రెండో చిత్రం 'ఆర్య' తోనే నటుడిగా తనదైన ముద్ర వేశాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నంది అవార్డు లభించింది.


తన మూడో చిత్రం 'బన్నీ' తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఈ సినిమా నుంచే అల్లు అర్జున్ ని బన్నీ అని పిలవడం మొదలుపెట్టారు..!


మూడు హ్యాట్రిక్ చిత్రాల తర్వాత చేసిన నాలుగో సినిమా హ్యాపీ అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ, బుల్లితెరలో మాత్రం తన సత్తాను చాటింది ఈ సినిమా. 2007లో విడుదలైన దేశముదురు చిత్రంతో ఘన విజయం అందుకున్నాడు అల్లు అర్జున్. ఆ చిత్రంలో సిక్స్ ప్యాక్ చేసి అందరిని మెప్పించాడు. తెలుగు ఇండస్ట్రీలో సిక్స్ ప్యాక్ చేసిన మొట్టమొదటి హీరో అల్లు అర్జున్ నే కావడం గమనార్హం. అదే సంవత్సరంలో చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించాడు..!


ఆ తర్వాత 2008, 2009 లో విడుదలైన పరుగు, ఆర్య 2 సినిమాల్లో విలక్షణ పాత్రలతో విజయాన్ని అందుకున్నారు. అలాగే పరుగు చిత్రానికి గాను అల్లుఅర్జున్ కి మరో నంది అవార్డు దక్కింది.


ఇక 2010లో విడుదలైన 'వరుడు' చిత్రం అల్లు అర్జున్ కెరీర్ లో డిజాస్టర్‌ గా మిగిలింది. అదే సంవత్సరంలో రిలీజైన మల్టీస్టారర్ చిత్రం 'వేదం' తో హిట్ కొట్టాడు. ఆ చిత్రంలో నటుడిగా మంచి అందరి ప్రశంసలు అందుకున్నాడు అల్లువారబ్బాయి. ఆ చిత్రంలో అల్లు అర్జున్ నటనకు ఫిలింఫేర్ ఫర్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. .!


ఆ తర్వాత కాలంలో జులాయి (2012), రేసుగుర్రం (2014), సన్నాఫ్ సత్యమూర్తి (2015), సరైనోడు (2016), దువ్వాడ జగన్నాథం ( 2017) … వంటి ఘనవిజయాలతో అగ్రస్థాయికి చేరుకున్నాడు. అలాగే రుద్రమదేవి (2015), నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా(2018) వంటి చిత్రాలు నిరాశపరిచినా... ఫలితాలతో సంబంధం లేకుండా నటుడిగా మెప్పించాడు.


జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురం తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను చెరిపేసి, సరికొత్త రికార్డులను క్రియోట్ చేసింది. అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచింది.


ప్రస్తుతం హీరోగా తన 20వ సినిమాను సుకుమార్ తో తీస్తున్నాడు. "పుష్ప" తో మరో విలక్షణ స్టైల్ ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు స్టైలిష్ స్టార్. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుంతుంది. ఈ చిత్రం ఆగష్టు 13న విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories