Pushpa 2 Movie: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్ ఇది

Pushpa 2 Movie: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్ ఇది
x
Highlights

Pushpa 2 New Release Date: పుష్ప 2 మూవీ నిర్మాతలు కొత్తగా మరో రిలీజ్ డేట్ ప్రకటించారు. గతంలో ప్రకటించిన తేదీ ప్రకారం డిసెంబర్ 6న పుష్ప 2 మూవీ రిలీజ్...

Pushpa 2 New Release Date: పుష్ప 2 మూవీ నిర్మాతలు కొత్తగా మరో రిలీజ్ డేట్ ప్రకటించారు. గతంలో ప్రకటించిన తేదీ ప్రకారం డిసెంబర్ 6న పుష్ప 2 మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ తాజాగా సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసిన చిత్ర నిర్మాతలు, అందులో కొత్త తేదీని ఎనౌన్స్ చేశారు. డిసెంబర్ 6 కంటే ఒక రోజు ముందే.. అంటే డిసెంబర్ 5నే పుష్ప 2 : ది రూల్ మూవీ థియేటర్లలోకి వచ్చేస్తుందని స్పష్టంచేశారు. అంతేకాదు.. ఇండియాలో డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీమియర్ మాత్రం డిసెంబర్ 4నే అవనుంది. అంటే విదేశాల్లో ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి ఇంకొన్ని గంటల ముందుగానే పుష్ప 2 మూవీ కిక్కు ఎక్కనుందన్న మాట.

అల్లు అర్జున్, సమంత జంటగా నటించిన పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్‌కు భారీ క్రేజ్ లభించింది. ప్యాన్ ఇండియా లెవెల్లో సినిమా సూపర్ హిట్ అయిందని ఆ సినిమాకు వచ్చిన టాక్ ప్లస్ కలెక్షన్స్ చెబుతున్నాయి. అంతేకాదు.. డైరెక్టర్ సుకుమార్ పుష్ప మూవీ పార్ట్ 2 లో ఇంకా ఏం చూపించనున్నారు అని ఆడియెన్స్‌లో ఒక సస్పెన్స్‌ని క్రియేట్ చేశాడు. ఆడియెన్స్, అభిమానుల అంచనాలకు తగినట్లుగానే పుష్ప 2 మూవీని తెరకెక్కిస్తున్నట్లుగా ఇప్పటికే సుకుమార్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇవన్నీ ప్లస్ అవడంతో పుష్ప 2 మూవీకి ప్రిరిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుగుతున్నట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన మ్యూజిక్ పుష్ప మూవీని మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. పుష్ప మూవీలో రారా సామీ పాట, ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావ వంటి పాటలు అన్ని భాషల్లోనూ హిట్ అయ్యాయి. అప్పట్లో రీల్స్‌లో, షార్ట్స్‌లో ఆ పాటలు ఒక ట్రెండ్ క్రియేట్ చేశాయి. ఇక త్వరలోనే రానున్న పుష్ప 2 మూవీలో కొత్తగా ఏం రానుందా అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories