Allu Aravind visits Kims hospital: శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

Allu Aravind visits sritej in kims hospital
x

Allu Aravind visits Kims hospital: శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

Highlights

ఇక మంగళవారం శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌ను వైద్యులు విడుదల చేశారు. పరిస్థితిపై విషమంగానే ఉందని కిమ్స్ వైద్యులు చేతన్, విష్ణు తేజ్ తెలిపారు. వెంటిలేటర్ సాయంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మెదడుకు ఆక్సిజన్ సరిగా అందడంలేదని.. బాలుడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు.

సంధ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్‌(KIMS) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సినీ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) పరామర్శించారు. బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్(Sri Tej) గత రెండు వారాలుగా కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక మంగళవారం శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌ను వైద్యులు విడుదల చేశారు. పరిస్థితిపై విషమంగానే ఉందని కిమ్స్ వైద్యులు చేతన్, విష్ణు తేజ్ తెలిపారు. వెంటిలేటర్ సాయంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మెదడుకు ఆక్సిజన్ సరిగా అందడంలేదని.. బాలుడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు.

డిసెంబర్ 4న సంధ్య థియేటర్ తొక్కిసలాటలో శ్రేతేజ్ తల్లి రేవతి(Revati) మరణించారు. ఇదే ఘటనలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు శ్రీతేజ్ కు సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 4 నుంచి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో ను అల్లు అర్జున్ సంధ్య థియేటర్ లో చూసేందుకు వచ్చారు. ఈ విషయం తెలిసిన అభిమానులు పోటెత్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories