శోభిత ధూళిపాళ్ళ: నాగ చైతన్యను పెళ్ళి చేసుకోబోతున్న ఈ అమ్మాయి ఎవరు?

Who is Sobhita Dhulipala
x

శోభిత ధూళిపాళ్ళ: నాగ చైతన్యను పెళ్ళి చేసుకోబోతున్న ఈ అమ్మాయి ఎవరు?

Highlights

జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శోభిత 1992 మే 31న తెనాలిలో జన్మించారు. ఆమె తండ్రి వేణుగోపాలరావు విశాఖలో మర్చంట్ నేవీ ఇంజనీర్ గా పని చేసేవారు.

శోభిత ధూళిపాళ్ళ… ఇప్పుడు తెలుగు మీడియాలో ట్రెండింగ్ నేమ్. టాలీవుడ్ హీరో నాగ చైతన్యతో శోభితకు ఎంగేజ్మెంట్ అయిందనే వార్త బయటకు రావడంతో ఆమె గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. సినిమా రంగంతో పాటు మాడలింగ్, ఫ్యాషన్ రంగాలను ఫాలో అవుతున్న వారికి శోభిత ధూళిపాల సుపరిచితమే. కానీ, తెలుగు ప్రేక్షకుల్లో మాత్రం ఆమె గురించి చాలా మందికి అంతగా తెలిసే అవకాశం లేదు.

శోభిత 2013లో ఫెమీనా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెల్చుకోవడంతో తొలిసారిగా వార్తల్లోకెక్కారు. ఆ విజయం ఆమెకు మాడలింగ్ రంగంలో అవకాశాలకు తలుపులు తెరిచింది. మాడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటూనే ఆమె సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.

అనురాగ్ కాశ్యప్ దర్శకత్వంలో వచ్చిన రమణ్ రాఘవ్ శోభిత నటించిన తొలి చిత్రం. అందులో ఆమె విక్కీ కౌశల్ తో కలిసి నటించారు. ఆ జటిలమైన పాత్రలో బాగా మెప్పించారంటూ క్రిటిక్స్ నుంచి ఆమె ప్రశంసలు అందుకున్నారు.

ఆ తరువాత తెలుగులో అడివి శేషుతో కలిసి గూఢచారి చిత్రంలో నటించారు. అయితే, 2019లో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో వచ్చిన హెవెన్ వెబ్ సిరీస్ నటిగా ఆమె కెరీర్ ను కొత్త మలుపు తిప్పింది. వెడ్డింగ్ ప్లానర్ తారా ఖన్నాగా ఆమె ఆ సిరీస్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఆమె ఎక్కువగా హిందీ, తమిళ చిత్రాలలో నటించారు. మణిరత్నం దర్శకత్వం వహించిన భారీ చిత్రం పొన్నియన్ సెల్వన్ లో శోభిత కీలక పాత్ర పోషించారు. ఓటీటీ ఒరిజినల్స్ లో నటించి బాగా పాపులర్ అయిన శోభితకు 2023లో హాలీవుడ్ ఆఫర్ వచ్చింది. దేవ్ పటేల్ తొలిసారిగా దర్శకత్వం వహించిన మంకీ మ్యాన్ అనే యాక్షన్ థ్రిల్లర్ లో ఆమె నటించారు.

జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శోభిత 1992 మే 31న తెనాలిలో జన్మించారు. ఆమె తండ్రి వేణుగోపాలరావు విశాఖలో మర్చంట్ నేవీ ఇంజనీర్ గా పని చేసేవారు. తల్లి శాంత కామాక్షి స్కూల్ టీచర్. విశాఖలో కొంతకాలం చదువుకున్న తరువాత ఆమె కార్పొరేట్ లా చదివేందుకు ముంబయి వెళ్ళారు.

విశాఖలో ప్రతి ఏటా జరిగే నేవీ బాల్ వేడుకల్లో 2010లో పాల్గొన్నారు. అప్పుడు ఆమె నేవీ క్వీన్ కిరీటాన్ని గెల్చుకుని తొలిసారిగా వార్తల్లోకెక్కారు. ఆ తరువాత మూడేళ్ళకు ఫెమీనా మిస్ ఇండియా ఎర్త్ గా ఎంపికయ్యారు.

అమెజాన్ హెవెన్ సిరీస్ తరువాత నెట్ ఫ్లిక్స్ లో బార్డ్ ఆఫ్ బ్లడ్ థ్రిల్లర్ లోనూ శోభిత తన సత్తా చాటుకున్నారు. ఇమ్రాన్ షష్మి సరసన ఆమె నటించిన ది బాడీ అనే హిందీ సినిమాలో ఆమె మరీ బోల్డ్ గా నటించారనే విమర్శలు వచ్చాయి.

తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన మేజర్ చిత్రం కూడా ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అనిల్ కపూర్ తో కలిసి ది నైట్ మేనేజర్ సిరీస్ లో రెండు సీజన్స్ లో ఆమె నటించారు. అయితే, మణిరత్నం ఎపిక్ చిత్రం పొన్నియన్ సెల్వన్ నటిగా ఆమె గ్రాఫ్ ను పూర్తిగా మార్చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories