'అల వైకుంఠపురములో' డిలీట్ సీన్: సుశాంత్ ని ఏం పరిగెత్తించావ్ బన్నీ

అల వైకుంఠపురములో డిలీట్ సీన్: సుశాంత్ ని ఏం పరిగెత్తించావ్ బన్నీ
x
Ala Vaikunthapurramuloo Deleted Scene
Highlights

ఇప్పుడు నేనేం చేయాలనీ రాజు అడగగా, ఆఫీస్‌కు బస్సులో వెళ్లేందుకు రాజు పరిగెత్తడం, వెనుక కారులో బంటి వీడియో తీయడం, అదే కారులో ఉన్న వాల్మీకి(మురళీశర్మ ) అల్లాడిపోవడం

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్ నుంచి వచ్చిన చిత్రం 'అల.. వైకుంఠపురములో'.. భారీ అంచనాల నడుమ ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలకి ముందు తమన్ పాటలు , త్రివిక్రమ్ టేకింగ్ , అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ , పూజా అందాలు ఇలా వేటికవే హైలెట్ గా నిలుస్తూ సినిమాని బిగ్గెస్ట్ హిట్ గా నిలిపాయి. తాజాగా ఈ చిత్రం యాబై రోజులు పూర్తి చేసుకొని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ డిలీటెడ్ సీన్‌ను చిత్రయూనిట్ యుట్యూబ్ లో విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రాజు (సుశాంత్) స్విమ్మింగ్ ఫూల్ లో ఉన్నప్పుడు బంటి (అల్లు అర్జున్) రాజుకి ఓ వీడియో చూపిస్తాడు. అందులో రాజు (సుశాంత్) మద్యం సేవించిన వీడియో ఉంటుంది. దానిని 'అర్జున్ రెడ్డి 2'గా షార్ట్ పిల్మ్ తీస్తున్నానని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలనీ రాజు అడగగా, ఆఫీస్‌కు బస్సులో వెళ్లేందుకు రాజు పరిగెత్తడం, వెనుక కారులో బంటి వీడియో తీయడం, అదే కారులో ఉన్న వాల్మీకి(మురళీశర్మ ) అల్లాడిపోవడం వంటివి ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియోకి మంచి వ్యూస్ వస్తూ దూసుకుపోతుంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హేగ్దే కథానాయకగా నటించింది. రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, నివేతా పెతురాజ్, సుశాంత్ , తనికెళ్ళ భరణి మొదలగువారు కీలక పాత్రల్లో మేరిశారు. ఈ సినిమాని అల్లు అరవింద్‌, రాధకృష్ణలు సంయుక్తంగా గీతాఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ సినిమాలో బిజీగా ఉంటే, సుశాంత్ ఓ కొత్త దర్శకుడితో "ఇచ్చట వాహననములు నిలపరాదు" అనే సినిమాని చేస్తున్నాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories