OMG 2: కొత్త వివాదానికి వెల్ కమ్ చెబుతున్న అక్షయ్ కుమార్?

Akshay Kumar Invites New Controversy
x

OMG 2: కొత్త వివాదానికి వెల్ కమ్ చెబుతున్న అక్షయ్ కుమార్?

Highlights

OMG 2: బాలీవుడ్ లో ఏడాదికి పావు డజన్ కి పైనే సినిమాలు చేసే స్టార్ అక్షయ్ కుమార్.

OMG 2: బాలీవుడ్ లో ఏడాదికి పావు డజన్ కి పైనే సినిమాలు చేసే స్టార్ అక్షయ్ కుమార్. అలానే ఏడాదికి కనీసం 2 లేదంటే మూడు హిట్లు సొంతం చేసుకోవటంలో కూడా తనే ముందుంటాడు.. కాని గత కొన్నేళ్లుగా అరడజన్ కి పైనే ఫ్లాపులతో డీలా పడ్డాడు. అలాంటి తనని ఇప్పుడు శివుడే కాపాడుతాడా? ఓమైగాడ్ దేవుడి మీద అక్షయ్ తన భారమంతా మోపేస్తున్నాడా?

ఓ మై గాడ్ సీక్వెల్ టీజర్ పేలుతోంది. కాని కొత్త అనుమానాలకు ఈ టీజర్ కారణమౌతోంది. పార్ట్ 1 లో గోపాలుడిగా కనిపించిన అక్షయ్ ఈసారి శివుడి అవతారంలో దర్శనమివ్వబోతున్నాడు. అయితే ఇది బాయ్ కాట్ బ్యాచ్ ని ఈజీగా రీచ్ అయ్యేలా ఉందట. వివాదంగా మారేలా ఉందట. అసలే హిట్లు లేవు. 2019 లో వచ్చి మిషన్ మంగల్ హిట్ తర్వాత ఏదో హౌజ్ ఫుల్ 4, సూర్య వంశీ, రామసేతు అంటూ ఒకటి అర యావరేజ్ లు సొంతం చేసుకున్నాడు అక్షయ్. మిగతా 9 సినిమాలు ప్లాపే అయ్యాయి. అందుకే తనని ఆదుకునేది శివుడే అంటూ కృష్ణావతారం తర్వాత ఈశ్వరుడి అవతారంలో బాక్సాఫీస్ మీద దండెత్తుతున్నాడు.

నిజానికి ఓమైగాడ్ 2012 లో మంచి హిట్ మూవీగానే నిలిచింది. 11 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్ వస్తోంది. అంతా బానే ఉంది కాని, పీకేలో హిందూ దేవుళ్లని అవమాన పరిచారని, ఇప్పటికీ ఫైర్ అయ్యే బ్యాచ్ ఉంది. అలాంటి పరిస్థితుల మధ్య, పీకే కంటే ముందే అంతకుమించేలా కొన్ని నమ్మకాలను ప్రశ్నించే ప్రయత్నం చేసిన ఓమైగాడ్ కి, సీక్వెల్ అది ఇలాంటి టైంలో వస్తోందంటే ఎన్ని వివాదాలు మొదలౌతాయో అన్న అనుమానాలు పెరిగాయి.

ఏదేమైనా హిస్టారికల్ మూవీస్ నుంచి సెంటిమెంటల్ సినిమాల వరకు ఏం చేసినా అక్షయ్ ని ముప్పావు డజన్ మూవీలు ముంచేశాయి. ఒక్క హిట్ కోసం కల్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు అక్షయ్. అందుకే శివుడే తనని కాపాడుతాడంటూ భారీగా ఆశలు పెట్టుకున్నాడు. నిజానికి గోపాలుడి పాత్రలో అక్షయ్ కనిపిస్తే అప్పుడు ఓ మై గాడ్ హిట్టైంది. బ్రహ్మస్త్రలో శివ, పార్వతులు అంశగా వస్తే రణ్ బీర్, ఆలియాకు హిట్ మెట్టెక్కే ఛాన్స్ వచ్చింది. ఆ సెంటిమెంట్ ప్రకారం చూస్తే అక్షయ్ కి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే వరుస ప్లాపులనుంచి బయట పడే ఛాన్స్ దొరుకుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories