Nagarjuna: 'ఆ విషయంలో సింహంలా నిలబడతా'.. నాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Nagarjuna: తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎంతటి రచ్చకు దారి తీశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Nagarjuna: తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎంతటి రచ్చకు దారి తీశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున కుటుంబంతో పాటు సమంతపై ఆమె చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై యావత్ సినిమా ఇండస్ట్రీ భగ్గుమంది. ఇండస్ట్రీ మొత్తం నాగార్జున కుటుంబానికి, సమంతకు మద్ధతుగా నిలిచారు. మంత్రి వ్యాఖ్యలను ముక్త కంఠంతో ఖండించారు.
ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న నాగార్జున న్యాయపరంగా చర్యలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే నాంపల్లి కోర్టులో కోండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబసభ్యుల పరువుకు భంగం కలిగించిన కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటిషన్‌లో కోరారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ విషయంపై నాగార్జున స్పందించారు. టాలీవుడ్ మొత్తం తనకు అండగా నిలబడ్డందుకు నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. తాను బలమైన వ్యక్తినని ఎప్పుడూ అనుకుంటానన్న నాగ్, తన కుటుంబాన్ని రక్షించే విషయంలో సింహంలా నిలబడతానని స్పష్టం చేశారు. అదృష్టవశాత్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతా కూడా ఈ విషయంలో తమకు అండగా నిలిచిందన్న నాగార్జున, ఇది తన నాన్నగారి ఆశీర్వాదాలుగా భావిస్తున్నాను అంటూ ఓ నోట్‌ను విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం ఈ నోట్ నెట్టింట వైరల్ అవుతోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire