Samantha: సమంతకు రూ. 200కోట్లు ఆఫర్ చేసిన అక్కినేని ఫ్యామిలీ? అసలు ట్విస్ట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు

Samantha: సమంతకు రూ. 200కోట్లు ఆఫర్ చేసిన అక్కినేని ఫ్యామిలీ? అసలు ట్విస్ట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు
x
Highlights

Samantha: సమంత..ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలోనూ మంచి...

Samantha: సమంత..ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలోనూ మంచి పాపులారిటీతోపాటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే సమంత చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 15ఏళ్ల అయింది. అయినా కూడా ఆమె చేతిలో భారీగానే సినిమా ఆఫర్లు, వెబ్ సిరీస్ లు ఉన్నాయి. లేడి ఓరియెంటెడ్ ప్రాజెక్టుల్లోనూ ఈ భామ మంచి విజయాలనే అందుకుంటోంది. ఇంత భారీ విజయాలను సొంతం చేసుకోవడం సమంతకే చెల్లుతోందని చెప్పవచ్చు.

అయితే అక్కినేని నాగచైతన్యతో ప్రేమ వివాహం..విడాకుల తర్వాత సమంత ఇప్పుడు ఒంటరిగానే ఉంటోంది. ఈ అమ్మడు ఇప్పుడు ముంబైలో సినిమాలు బిజీగా మారింది. వీరిద్దరి విడాకుల సమయంలో అక్కినేని ఫ్యామిలీ సామ్ కు రూ.200కోట్లు భరణం కింద ఆఫర్ చేసినట్లు వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలు వైరల్ అవ్వడంతో ఓ సందర్భంలో సమంత ఈ వార్తల గురించి స్పందించిందని వస్తున్న వార్తలు ఫేక్ అంటున్నారు. చైతన్య-శోభిత విడాకుల గురించి నాగార్జున అగ్రిమెంట్ రాయించుకున్నారన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్న నేపథ్యంలో సమంత రూ. 200 కోట్ల ఆఫర్ మరోసారి వార్తల్లోకి వచ్చింది.

నిజానికి సమంత ఇండిపెండెంట్ గా జీవించేందుకు ఇష్టపడుతారు. ఆమె అక్కినేని ఎలాంటి భరణం తీసుకోలేదని సమాచారం. సొంతంగా ఆదాయం సంపాదించుకుంటోంది. వరుస సినిమాలు చేస్తూ బాగానే సంపాదిస్తోంది. సమంతకు దాదాపు 150కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయట. అయితే సమంత, నాగచైతన్య మనస్పర్థల వల్ల విడిపోయారు తప్ప వాళ్లు విడిపోయేందుకు అంతకు మించిన కారణాలేవని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

అక్కినేని ఫ్యామిలీ సమంతకు భరణం ఆఫర్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. సమంత చాలా పవర్ ఫుల్ ఉమెన్. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కునే ధైర్యం ఆమెలో ఉంది. ఎలాంటి సమస్యలను ఎలా ఫేస్ చేయాలో సమంతకు బాగా తెలుసనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సమంత తన కెరీర్ పరంగా అంచెలంచెలుగా ఎదిని మరిన్ని సక్సెస్ లు సొంతం చేసుకోవాలని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. కాగా సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం ప్రాజెక్టుతో చాలా బిజీగా గడుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories