Aishwarya Rai Bachchan taken to hospital: ఆసుపత్రిలో చేరిన ఐశ్వర్య రాయ్!

Aishwarya Rai Bachchan taken to hospital: ఆసుపత్రిలో చేరిన ఐశ్వర్య రాయ్!
x
Highlights

Aishwarya Rai Bachchan taken to hospital: అబిషేక్ బచ్చన్ భార్య.. మాజీ విశ్వసుందరికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పటికే అమితాబ్, అభిషేక్ లు కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో అభిషేక్ భార్య మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం అందరికీ తెలిసిందే. కరోనా పాజిటివ్ రావడంతో ఆమె కొంత కాలంగా హోం క్వారంటైన్ లో ఉన్నారు. అయితే, అకస్మాత్తుగా ఆమెను ముంబాయిలోని లీలావతి ఆసుపత్రిలోచేర్చారు.

వారం రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ కరోనా పాజిటివ్ రావడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ఇదే సమయంలో అయన కుటుంబ సభ్యులు అందరికీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీకాశాల్లో అభిషేక్ బచ్చన్ కు కరోనా సోకినట్టు మొదట నిర్ధారణ అయిన్ది. దానితో అయన కూడా ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు.

తరువాతి రోజు ఐశ్వర్య రాయ్ బచ్చన్, వారి కుమార్తె ఆద్య కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన్ది. దీంతో వారిద్దరూ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అమితాబ్ భార్య జయ బచ్చన్ కు కరోనా నెగెటివ్ వచ్చింది. ఇక వీరుంటున్న బంగ్లా జల్సా ను పూర్తిగా మూసివేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అకస్మాత్తుగా ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఆసుపత్రిలో చేరడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి పై అందరిలో ఆందోళన నెలకొంది.


Show Full Article
Print Article
Next Story
More Stories