Malaika Arora : మలైకా అరోరాకి కరోనా పాజిటివ్!

Malaika Arora : మలైకా అరోరాకి కరోనా పాజిటివ్!
x

Covid-19

Highlights

Malaika Arora : బాలీవుడ్ పై కరోనా ప్రభావం ఎక్కువగానే ఉందని చెప్పాలి.. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, అబిషేక్ బచ్చన్ లతో పాటుగా పలువురు

Malaika Arora : బాలీవుడ్ పై కరోనా ప్రభావం ఎక్కువగానే ఉందని చెప్పాలి.. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, అబిషేక్ బచ్చన్ లతో పాటుగా పలువురు కరోనా బారిన పడగా, తాజాగా హీరో అర్జున్ కపూర్ కి కరోనా బారిన పడ్డారు.. ఈ విషయాన్ని అర్జున్ కపూర్ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. తనకి లక్షణాలు లేనప్పటికీ వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లో ఉండనున్నట్లుగా వెల్లడించాడు. ఇక ఇది ఇలా ఉంటే అర్జున్ కపూర్ ప్రియురాలు మలైకా అరోరాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె సోదరి అమృతా అరోరా వెల్లడించింది. గత కొంతకాలంగా అర్జున్ కపూర్ - మలైకా అరోరా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే..

అంతకుముందు అర్జున్ కపూర్ తన ఇన్‌స్టాలో ఓ భాగోద్వేగ లేఖను పోస్ట్ చేశారు. " నాకు కరోనా నిర్ధారణ అయింది. దీనిని మీతో పంచుకోవడం నా కర్తవ్యం. లక్షణాలు ఏమీ లేనప్పటికీ వైద్యుల సూచనలు, సలహాలు తీసుకుంటూ హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగనే ఉంది. నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ముందుగానే ధన్యవాదాలు చెబుతున్నాను. ఇక నా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలని ఎప్పటికప్పుడు మీతో పంచుకుంటాను. మానవత్వమే వైరస్‌పై విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను" అని అర్జున్ కపూర్ అందులో పేర్కొన్నారు.

ఇక మలైకా అరోరాకి గతంలోనే వివాహం జరిగింది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. అర్బాజ్ ఖాన్ నుంచి 2017లో మలైకా విడిపోయారు. అనంతరం అర్జున్ కపూర్ తో ప్రేమలో ఉన్నారు. అటు అర్జున్ కపూర్ కూడా గతంలో సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్‌తో రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇక అర్జున్ కపూర్ - మలైకా అరోరా మధ్య సుమారుగా 18 సంవత్సరాల వయసు తేడా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories