Aadah Sharma: ఇదేం ఫ్యాషన్.. ఆకులే అడ్డంగా.. రెచ్చిపోయిన అదాశర్మ..

Adah Sharma Wear A Dress Made of Leaves
x

Adah Sharma: ఇదేం ఫ్యాషన్.. ఆకులే అడ్డంగా.. రెచ్చిపోయిన అదాశర్మ..

Highlights

Aadah Sharma: హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఆదాశర్మ.

Adah Sharma: హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఆదాశర్మ.. సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఆదాశర్మకి ఆశించిన సినిమా అవకాశాలు అయితే రాలేదు. ఎక్కువగా గ్లామర్ పాత్రలను చేసుకుంటూ వచ్చింది. దీంతో తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు కరువయ్యాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆదా చేసే రచ్చ గురించి తెలిసిందే. వెరైటీ ఫోటోషూట్స్ అంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు సోషల్‌ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ బ్యూటీ ఆకులతో డిజైన్‌ చేసిన గౌను ధరించి ఫోటోషూట్‌ చేయించుకుంది. ఆ ఫొటోలను సోషల్‌ మీడియా షేర్‌ చేస్తూ.. ''ప్రకృతి చాలా గొప్పది. మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉండనిస్తుంది. అన్ని జీవరాసులను స్వీకరించే శక్తి మానవులకే ఇచ్చింది'' అని రాసుకొచ్చారు. అదా షేర్‌ చేసిన ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories