Taapsee: ఈ సినిమాలో నటించిన వారికి ఆ బాధ ఉంది.. తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

Taapsee
x

Taapsee

Highlights

Taapsee: 2016లో వచ్చిన కాంచన మూవీతో బాలీవుడ్‌లో తొలి విజయాన్ని అందుకుంది నటి తాప్సీ. ఇక తాప్సీ కెరీర్‌ విషయానికొస్తే తన కెరీర్‌ను మొత్తం నార్త్‌ వైపే కేంద్రీకరించింది.

Taapsee: 2016లో వచ్చిన కాంచన మూవీతో బాలీవుడ్‌లో తొలి విజయాన్ని అందుకుంది నటి తాప్సీ. నిజానికి అంతకు ముందే తాప్సీ కొన్ని హిందీ చిత్రాల్లో నటించినా పింక్‌ మూవీతో భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఒక రకంగా ఈ సినిమా ఆమె కెరీర్‌ను మార్చేసిందని చెప్పాలి. సమాజంలో మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలను దర్శకుడు తనదైన శైలిలో చూపించిన ఈ సినిమా కమర్షియల్‌గానే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలైన సెప్టెంబర్‌ 16వ తేదీకి సరిగ్గా ఎనిమిదేండ్లు అయ్యింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నటి తాప్సీ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ.. ‘భారతీయ సినీ చరిత్రలోనే గొప్ప సినిమాల్లో ‘పింక్‌’ ఒకటిగా నిలుస్తుంది. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఆ స్థాయిని మేం ఊహించలేదు. అలాంటి గొప్ప సినిమాలో భాగమైనందుకు ఇప్పటికీ గర్వంగా ఫీలవుతానని చెప్పుకొచ్చింది.

ఇక ఏ సమస్యను ప్రశ్నిస్తూ.. ఎనిమిదేళ్ల క్రితం ఆ సినిమా చేశామో.. ఆ సమస్య ఇప్పటికీ అలాగే ఉందని తెలిపిందని, ఇంకా మాట్లాడితే ఇంకా జటిలమైందని చెప్పుకొచ్చింది. స్త్రీలకు సమాజంలో ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందన్న తాప్పీ.. ఈ సినిమాలో నటించిన అందరికీ ఆ బాధ ఉందని చెప్పుకొచ్చింది. పింక్‌ మూవీ కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకున్న పింక్‌.. ‘బెస్ట్‌ ఫిల్మ్‌ ఆన్‌ సోషల్‌ ఇష్యూస్‌’ కేటగిరిలో జాతీయ అవార్డుతో పాటు మరెన్నో అవార్డులను సొంతం చేసుకుంది.

ఇక తాప్సీ కెరీర్‌ విషయానికొస్తే తాప్సీ ప్రస్తుతం తన కెరీర్‌ను మొత్తం నార్త్‌ వైపే కేంద్రీకరించింది. బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన వో లడ్ఖీ హై ఖహానీ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories