Sreeleela: అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం

Actress Sreeleela Responds on Allu Arjun Arrest
x

Sreeleela: అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం

Highlights

Sreeleela: అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్ చేయడం బాధాకరమని నటి శ్రీలీల (sreeleela) అన్నారు.

Sreeleela: అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్ చేయడం బాధాకరమని నటి శ్రీలీల (sreeleela) అన్నారు. శనివారం విశాఖపట్టణంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అరెస్టైన తర్వాత బెయిల్ పై ఆయన విడుదలకావడంపై ఆమె సంతోషపడ్డారు.అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో అందరం టెన్షన్ పడినట్టు ఆమె తెలిపారు.చట్టాన్ని అల్లు అర్జున్ గౌరవించారని ఆమె అన్నారు.సంధ్య థియేటర్ (sandhya theatre) లో తొక్కిసలాట సందర్భంగా రేవతి అనే మహిళ మరణించడం దురదృష్టకరమైన ఘటనగా ఆమె చెప్పారు.

సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో రేవతి (Revathi) అనే మహిళ మరణించారు. ఈ ఘటనపై నమోదైన కేసులో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు డిసెంబర్ 13న అరెస్ట్ చేశారు. నాంపల్లి (Nampally ) కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ ఆర్డర్ సకాలంలో జైలు అధికారులకు అందకపోవడంతో ఆయన చంచల్ గూడ జైల్లోనే డిసెంబర్ 13 రాత్రి గడిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories