Shruti Haasan: మా ఫ్రెండ్స్ ఎగతాళి చేసేవారు.. చిన్ననాటి జ్ఞాపకాన్ని పంచుకున్న శృతిహాసన్‌

Shruti Haasan: మా ఫ్రెండ్స్ ఎగతాళి చేసేవారు.. చిన్ననాటి జ్ఞాపకాన్ని పంచుకున్న శృతిహాసన్‌
x
Highlights

నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అందాల తార శృతిహాసన్‌. కమల్‌ హాసన్‌ కూతురిగా పెద్ద సపోర్ట్‌ ఉన్నా తన మల్టీ ట్యాలెంట్‌తో...

నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అందాల తార శృతిహాసన్‌. కమల్‌ హాసన్‌ కూతురిగా పెద్ద సపోర్ట్‌ ఉన్నా తన మల్టీ ట్యాలెంట్‌తో శృతి హాసన్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇక గోల్డెన్‌ స్పూన్‌తో పుట్టిన శృతిహాసన్ తాను మాత్రం సాధారణ పిల్లల్లాగే పెరిగానని చెప్పుకొచ్చింది. దీనికి తన తల్లి సారికనే కారణమని తెలిపింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శృతిహాసన్‌ ఇలాంటి ఆసక్తికర విషయాలు పంచుకుంది. దీంతో పాటు చిన్న తనంలో తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో షేర్‌ చేసుకుంది.

ఈ సందర్భంగా శృతిహాసన్‌ మాట్లాడుతూ.. పేరుకు తాము సెలెబ్రిటీల పిల్లలమైనా సాధారణ పిల్లల్లాగే పెరిగామని తెలిపింది. పెద్ద ఇల్లు, చుట్టూ ఎన్నో కార్లు ఉన్నా.. వాటిని చూసి తామెప్పుడూ గర్వాన్ని ప్రదర్శించలేదని చెప్పుకొచ్చింది. ఇంట్లో ఎప్పుడూ క్రమ శిక్షణతో కూడిన వాతావరణం ఉండేదన్న శృతీహాసన్‌. అసలు ‘పాకెట్‌ మనీ’ అనే కాన్సెప్ట్ తమ ఇంట్లో లేదని తెలిపింది. అన్నీ తామే సంపాదించుకునే వాళ్లమని తెలిపింది.

ఇక ‘ఇంత పెద్ద ఇల్లు. ఇన్ని కార్లతో పిల్లలు చెడిపోతారు..’ అని తన తల్లి ఎప్పుడూ భయపడేదని అందుకే తామంటే ఎంత ప్రేమగా ఉండేదో.. అంతే కఠినంగా వ్యవహరించేది! అని పాత రోజులను గుర్తు చేసుకుంది. చిన్నతనంలో జరిగిన ఓ సంఘటనను పంచుకున్న శృతీహాసన్‌.. ‘ఎవరి పుట్టిన రోజు జరిగినా మా స్నేహితులంతా ఫ్యాన్సీ చాక్లెట్లు పంచేవారు. ఓసారి నా పుట్టినరోజు నాడు మాత్రం.. మా అమ్మ బెల్లం-పల్లీలతో చేసిన చిక్కీ లడ్డూలను పంపించింది. వాటిని చూసిన నా స్నేహితులంతా నవ్వుకున్నారు. ‘మీ నాన్న సినిమా హీరో అని చెబుతావు కదా!? మరేంటి ఇలాంటి స్వీట్‌ తీసుకొచ్చావు?’ అంటూ ఎగతాళి చేశారు’ అని చెప్పుకొచ్చింది.

అయితే ఇలాంటి సంఘటనలు ఎదురైనా వాటన్నిటిలోనూ అమ్మకు ఉండే ప్రేమ, బాధ్యతే కనిపించేదని శృతీ హాసన్‌ తెలిపింది. ఇక ఇండస్ట్రీలో కూడా తన ఎదుగుదలకు తండ్రి పేరును ఎక్కడా వాడుకోలేదని చెప్పుకొచ్చింది. తన ఇంటి పేరు ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన మాట వాస్తవమే! కానీ, అది కేవలం అప్పుడప్పుడూ విమానాశ్రయాలలో క్యూలైన్‌లను తప్పించుకోవడానికి మాత్రమే ఉపయోగపడేది అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే శృతీహాసన్‌ ప్రస్తుతం లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో వస్తున్న ‘కూలీ’ చిత్రంలో రజినీకాంత్‌ సరసన నటిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories