Shanvi Srivastava: 'రౌడీ' బ్యూటీ ఇంత హాట్‌గా మారిందేంటి.? లేటెస్ట్‌ ఫొటోలు చూస్తే..!

Actress Shanvi Srivastava Latest Photos Goes Viral in Social Media
x

Shanvi Srivastava: 'రౌడీ' బ్యూటీ ఇంత హాట్‌గా మారిందేంటి.? లేటెస్ట్‌ ఫొటోలు చూస్తే..!

Highlights

Shanvi Srivastava: ఇలా వచ్చి అలా తెరమరుగు అయిన హీరోయిన్లు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు.

Shanvi Srivastava: ఇలా వచ్చి అలా తెరమరుగు అయిన హీరోయిన్లు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. తమదైన అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్లు కాలక్రమేణ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అలాంటి ఓ హీరోయిన్‌ గురించి ఈరోజు తెలుసుకుందాం.

2012లో వచ్చిన 'లవ్లీ' మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార శాన్వి శ్రీ వాస్తవ. తొలి చిత్రంలోనే తన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది. ఇక ఆ తర్వాత అడ్డా మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఇక మూడో చిత్రంతోనే సంచలన డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ చేతిలో పడింది. రౌడీ సినిమాలో తన అందంతో పాటు నటనతో మెస్మరైజ్‌ చేసిందీ చిన్నది. ఈ సినిమాలో శాన్వీ నటనకు మంచి మార్కులు పడ్డాయని చెప్పాలి.

ఇక ఆ తర్వాత తెలుగు సినిమాలను తగ్గించిన శాన్వీ కన్నడ సినిమాలతో బిజీగా మారింది. వరుసగా 10 కన్నడ మూవీస్‌లో నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత మలయాళంలోనూ నటించింది. దీంతో తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో కేవలం రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్నాయి. త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

సినిమాల్లో అడపాదడపా కనిపిస్తున్నా సోషల్‌ మీడియా వేదికగా మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటోందీ బ్యూటీ. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన లేటెస్ట్‌ ఫొటోలను పోస్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పోస్ట్‌ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా గ్లామర్‌ అవుట్ ఫిట్‌లో కుర్రకారును ఫిదా చేస్తోంది బ్యూటీ. డెనిమ్‌ జీన్స్‌ షర్ట్‌ ధరించిన శాన్వీ ఫొటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. మరి మళ్లీ తెలుగులో నటిస్తోందో లేదా చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories