Samantha: 'ప్రేమ అనేది ఒక త్యాగం'.. వైరల్‌ అవుతోన్న సమంత పోస్ట్‌

Samantha Ruth Prabhu
x

Samantha Ruth Prabhu

Highlights

సమంత ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ ఆసక్తికర వ్యాఖమైన పోస్ట్‌ను చేసింది. 'చాలా మంది వ్యక్తులు స్నేహాలు, సంబంధాలను పరస్పరం కొనసాగిస్తారు.

నటి సమంత సోషల్ మీడియాలో ఏ చిన్న పోస్ట్‌ చేసినా హాట్‌ టాపిక్‌గా మారుతోంది. మరీ ముఖ్యంగా నాగచైతన్య, శోభితా నిశ్చితార్థం తర్వాత సమంత ఇన్‌స్టాలో ఏ పోస్ట్‌ పెట్టినా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సామ్‌ చేసే ప్రతీ పోస్ట్‌ చైతన్యను ఉద్దేశించే అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్‌ చేస్తున్నారు. సమంత తాజాగా చేసిన పోస్ట్‌ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లైంది. ఇంతకీ సమంత చేసిన పోస్ట్ ఏంటి.? అందులో అంతలా ఏముందో తెలియాలంటో ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

సమంత ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ ఆసక్తికర వ్యాఖమైన పోస్ట్‌ను చేసింది. 'చాలా మంది వ్యక్తులు స్నేహాలు, సంబంధాలను పరస్పరం కొనసాగిస్తారు. వీటిని నేను కూడా అంగీకరిస్తున్నాను. మీరు ప్రేమను పంచుతారు. నేను కూడా తిరిగి ఇస్తాను. కానీ కొన్నేళ్లుగా నేను నేర్చుకున్నది ఏంటంటే.. మనం ప్రేమను పంచే ఎదుటి వ్యక్తి తిరిగి ఇచ్చే స్థితిలో లేనప్పుడు కూడా ప్రేమను అందజేస్తాం. ఎందుకంటే ప్రేమ అనేది ఓ త్యాగం. మనకు అవతలి వైపు నుంచి ప్రేమ, ‍అప్యాయతలు అందకపోయినా.. ఇప్పటికీ తమ ప్రేమను ధారపోస్తున్న వ్యక్తులకు కృతజ్ఞతలు' అంటూ రాసుకొచ్చింది.

సమంత చేసిన పోస్ట్‌ ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. సమంత ఈ పోస్టును ముమ్మాటికీ నాగచైతన్యను ఉద్దేశించే చేసిందని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రేమ, త్యాగం, ఎదుటి వ్యక్తి ప్రేమను తిరిగి ఇవ్వని పరస్థితి లాంటి పదాలు చూస్తుంటే కచ్చితంగా సమంత ఏదో మెసేజ్‌ ఇస్తోందని అంతా అభిప్రాయపడుతున్నారు. మరి సమంత చేసిన ఈ పోస్ట్‌పై నాగచైతన్య స్పందిస్తారో లేదో చూడాలి.

ఇక సమంత కెరీర్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం సామ్‌ నటించిన సిటాడెల్‌ సిరీస్‌ ఒక్కటే విడుదలకు సిద్ధంగా ఉంది. రాజ్ నిడిమోరు, డీకే డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ సరసన కనిపించనుంది. అయితే సామ్‌ తన తర్వాతి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్టపి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే సామ్‌ తెలుగులో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని, సిటాడెల్ విడుదల తర్వాత బాలీవుడ్‌లో పలు ఆఫర్లకు ఓకే చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories