Samantha: అలా జరగకుండా ఉంటే బాగుండేదనుకున్నాను.. సమంత ఇట్రెస్టింగ్ కామెంట్స్‌..!

Actress Samantha Interesting Comments About her Life Experiences
x

Samantha: అలా జరగకుండా ఉంటే బాగుండేదనుకున్నాను.. సమంత ఇట్రెస్టింగ్ కామెంట్స్‌..!

Highlights

Samantha: సమంత.. ఈ పేరు వినగానే అందమైన రూపంతో పాటు అంతే కష్టం కూడా గుర్తొస్తుంది.

Samantha: సమంత.. ఈ పేరు వినగానే అందమైన రూపంతో పాటు అంతే కష్టం కూడా గుర్తొస్తుంది. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన సమంత ఆ తర్వాత విడాకులు, ఆ వెంటనే మయోసైటిస్‌ వ్యాధి ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తోంది. జీవితంలో ఇలాగే ఉండాలంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుందీ చిన్నది.

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. జీవితంలో ఎదురయ్యే ప్రతీ కష్టాన్ని ఎదుర్కోవాల్సిందేనని చెప్పుకొచ్చింది. 'జీవితంలో జరిగే కొన్ని విషయాలను మార్చుకోవాలని అందరం కోరుకుంటాం. అలా జరగకుండా ఉంటే బాగుండేదని భావిస్తాం. అయితే వెనక్కి తిరిగి చూసుకుంటే వేరే మార్గం ఉండదు. గత మూడేళ్లలో ఇలా జరగకుండా ఉంటే బాగుండేదని ఎన్నో విషయాల్లో అనుకున్నాను. కానీ, జీవితంలో వచ్చే ప్రతీ కష్టాన్ని ఎదుర్కోవాల్సిందే. అలాంటివి ఎదుర్కొన్నప్పుడే జీవితాన్ని గెలిచినట్లు భావిస్తాను' అని సమంత చెప్పుకొచ్చింది.

అయితే తాను గతంలో పోల్చితే ఇప్పుడు మరింత ధైర్యంగా ఉన్నాని తెలిపిన సామ్‌.. ఈ స్థాయికి రావడానికి అగ్నిగుండాల్లాంటి ఎన్నో సవాళ్లను దాటానని చెప్పుకొచ్చింది. దీంతో సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. సమంత ఈ వ్యాఖ్యలను ఎందుకు చేసిందన్న ప్రశ్నలు తలెత్తున్నాయి.

ఇదిలా ఉంటే మొన్నటి వరకు మయోసైటిస్‌ వ్యాధి కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన సామ్‌.. కొంత కాలం విశ్రాంతి తర్వాత మళ్లీ షూటింగ్స్‌లో బిజీ అవుతోంది. ఇప్పటికే.. ‘మా ఇంటి బంగారం’కు కమిట్‌ అయిన సామ్‌.. ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నట్లు సమాచారం. ఇక సమంత నటించిన మరో వెబ్‌ సిరీస్‌ సిటాడెల్‌ త్వరలోనే స్ట్రీమింగ్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories