Actress Ramya: వీడియోను తొలగించండి.. కోర్టును ఆశ్రయించిన నటి రమ్య..

Actress Ramya: వీడియోను తొలగించండి.. కోర్టును ఆశ్రయించిన నటి రమ్య..
x
Highlights

Kannada Actress Ramya: తన అనుమతి లేకుండా ఓ సినిమాలో తన వీడియోలను వాడుకున్నారని ఆరోపిస్తూ కన్నడ నటి, మాండ్య మాజీ ఎంపీ రమ్య కోర్టును ఆశ్రయించారు.

Kannada Actress Ramya: తన అనుమతి లేకుండా ఓ సినిమాలో తన వీడియోలను వాడుకున్నారని ఆరోపిస్తూ కన్నడ నటి, మాండ్య మాజీ ఎంపీ రమ్య కోర్టును ఆశ్రయించారు. హాస్టల్ హుడుగరు బేకాగిద్దారే మూవీలో తనకు తెలియకుండా తన సన్నివేశాలను వాడుకున్నారని పేర్కొంటూ రమ్య జనవరి7న కమర్షియల్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రమ్య కోర్టుకెళ్లడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

తన వీడియోలను వాడుకున్నందు రూ.కోటి పరిహారం ఇప్పించాలని రమ్య కోరారు. వీడియోను తొలగించాలని పలుసార్లు చెప్పినా.. నిర్మాతలు స్పందించలేదని ఆరోపించారు. వీడియోను డిలీట్ చేస్తే కేసు వెనక్కి తీసుకుంటానని పేర్కొన్నారు. 2023 జులై 21న విడుదలైన కన్నడ సినిమా హాస్టల్ హుడుగరు బేకాగిద్దారె లో తన అనుమతి లేకుండా తన వీడియోలను వాడుకున్నారనేది నటి రమ్య ప్రధాన ఆరోపణ. ఈ చిత్రం విడుదలకు ముందు నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపిన రమ్య.. వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు సినిమాను నిలిపివేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. అత్యవసరంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రమ్య అభ్యర్థనను తోసిపుచ్చింది. సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే తాజాగా మరోసారి రమ్య కోర్టుకు వెళ్లారు. సినీ నిర్మాత నుంచి తనకు రూ.కోటి పరిహారం ఇప్పించాలని కోరారు. తన వీడియోను తొలగించాలని పలుసార్లు కోరినా వారు స్పందించలేదని ఆరోపించారు. ఒకవేళ ఆ వీడియోను తొలగిస్తే కేసు వాపసు తీసుకుంటానని రమ్య స్పష్టం చేశారు. ఈ కేసు విషయమై జనవరి 7న తన లాయర్‌తో కలిసి రమ్య.. వాణిజ్య వివాదాల పరిష్కార కోర్టుకు హాజరయ్యారు. కన్నడ దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ హాస్టల్ హుడుగరు బేకాగిద్దారే చిత్రాన్ని రక్షిత్ శెట్టి పరమవ స్టూడియోస్ నిర్మించింది.

అభి అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రమ్య.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తొలి సినిమాతోనే పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సరసన హీరోయిన్‌గా నటించారు. తెలుగులో ఇదే సినిమాను కళ్యాణ్ రామ్ హీరోగా అభిమన్య పేరుతో రీమేక్ చేయగా ఇందులో కూడా రమ్యనే హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాలో నటించారు. సినిమాల్లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు.

2013లో జరిగిన బై ఎలక్షన్‌లో కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత ఎన్నికల్లో రెండో సారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉంటున్న రమ్య.. తాను మళ్లీ నటించేందుకు ఆసక్తితో ఉన్నానని తెలిపారు. అయితే సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. మంచి స్క్రిప్ట్ దొరికితే తప్పకుండా నటిస్తానని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories