డ్రగ్స్ కేసు : కోర్టుకెక్కిన రకుల్!

డ్రగ్స్ కేసు : కోర్టుకెక్కిన రకుల్!
x

Rakul Preet Singh 

Highlights

Rakul Preet Singh : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో భాగంగా డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే దీనికి సంబంధించి నార్కోటిక్స్

Rakul Preet Singh : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో భాగంగా డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే దీనికి సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు నిర్వహించగా అందులో టాలీవుడ్ నుంచి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు వచ్చింది. దీనితో టాలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ క్రమంలో డ్రగ్స్ కేసులో తనపై మీడియాలో జరుగుతున్న ప్రచారం పైన రకుల్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది.. మీడియాలో తనపైన వస్తున్న కథనాలను వెంటనే నిలిపివేసేలా సమాచారశాఖాకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేసింది.

అయితే రకుల్ పిటీషన్ ను విచారణ చెప్పట్టిన హైకోర్టు స్వీయ నియంత్రణ పాటించాలని మీడియా సంస్థలకు సూచించింది. సమాచార, ప్రసార శాఖ, ప్రసార భారతి, ఎన్ బీ ఏ, ప్రెస్ కౌన్సిల్ కు నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్‌ కేసులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) తనకు ఇంతవరకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, అయినప్పటికీ ఓ వర్గం మీడియా తనను టార్గెట్‌ చేసి వేధిస్తోందని పిటిషన్‌లో వివరించింది.. రకుల్‌ పిటిషన్‌ను జస్టిస్‌ నవీన్‌ శుక్లా బెంచ్‌ గురువారం విచారణ చేపట్టింది.



కాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు విచారణలో భాగంగా ముందు నుంచి నిందితురాలుగా ఉన్న సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని డ్రగ్స్ కేసులో భాగంగా నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఇటివల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. ఆమెతో పాటుగా ఆమె సోదరుడు షోవిక్‌, శామ్యూల్‌ మెరిండాతోపాటు మరి కొంతమందిని అరెస్టు చేసి, ఎన్‌సీబీ విచారణ చేస్తోంది. అయితే ఎన్‌సీబీ చేసిన విచారణలో రియా చక్రవర్తి 25 మంది సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా వెల్లడించిందని అందులో రకుల్, సారా ఆలీఖాన్ పేర్లు ఉన్నట్టుగా తాజాగా ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రా వెల్లడించారు. అయితే ఇంకా వారికి సమన్లు జారీ చేయలేదని, త్వరలో పంపించే ప్రయత్నంలో ఉన్నట్లుగా వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories