Pooja Hegde: పూజా హెగ్డే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

Tollywood: Pooja Hegde Hikes her Remuneration
x

ఇమేజ్ సోర్స్: న్యూస్ మినిట్.కం


Highlights

Pooja Hegde: దక్షిణాదిలో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకొనే హీరోయిన్ల జాబితాలో పూజాహెగ్డే చేరిపోయిందనే వార్త టాలీవుడ్ టాక్

Pooja Hegde: దక్షిణాదిలో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకొనే హీరోయిన్ల జాబితాలో పూజాహెగ్డే చేరిపోయిందనే వార్త టాలీవుడ్ టాక్. సౌత్‌లో నయనతార అత్యధికంగా రూ.6 కోట్లు, సమంత రూ.4 కోట్ల వరకు తీసుకొంటారనే విషయం ప్రచారంలో ఉంది. ఆ తర్వాత పూజా హెగ్గే ఆ ఘనతను సొంతం చేసుకొందనే వార్త వినిపిస్తున్నది. పూజా హెగ్డే కెరీర్ గ్రాఫ్ విషయానికి వస్తే.. తెలుగులో ఆమె నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్ చిత్రాలు రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. ప్రస్తుతం పూజా నటిస్తున్న సర్కస్, ఆచార్య చిత్రాలు షూటింగు దశలో ఉన్నాయి. హిందీలో సల్మాన్ ఖాన్‌తో కభీ ఈద్ కభీ దీవాళి చిత్రానికి ఒకే చెప్పింది. ఇంకా బాలీవుడ్, టాలీవుడ్‌లో పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.

వాజుద్దీన్ సిద్ధిఖీ ఈ ప్రాజెక్టులోకి వచ్చిన వార్త ఓ వైపు సంచలనం రేపగా, హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక మరో సెన్సేషన్‌గా మారింది. అయితే విజయ్ సరసన నటించడానికి నిర్మాతలు భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే దక్షిణాదిలో టాప్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా పూజా హెగ్డే పారితోషికం తీసుకొన్నట్టు ఓ వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఈ నటి విజయ్ 65 మూవీకి ఇటీవల సంతకం చేసింది. తాజా నివేదికల ప్రకారం, పూజా హెగ్డే ఈ చిత్రానికి పారితోషికంగా 2.5 కోట్లు వసూలు చేస్తున్నారు. టాలీవుడ్‌లో జరుగుతున్న హీరోయిన్లలో ఈ నటి ఒకరు, వీరికి భారీ అభిమానుల సంఖ్య మాత్రమే కాదు, భారీ మార్కెట్ కూడా ఉంది. ఆమె పాపులారిటీ కారణంగా, చాలా మంది చిత్రనిర్మాతలు కూడా ఆమెను రోప్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా జరగలేదు. షూటింగ్‌లో ఎక్కువ భాగం రష్యా, చెన్నైలలో జరుగుతుంది. ఈ చిత్రంలో శివకార్తికేయన్, నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో వైపు బాలీవుడ్ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టిందని... టాలీవుడ్ సినిమాలు తగ్గించుకోవాలని చూస్తోందని టాక్ వినపడుతోంది. మరీ అవసరం అనుకుంటే అత్యధికంగా పారితోషకం కావాలంటోందని... అయినా అడిగినంత పారితోషకం ఇవ్వడానికి సిద్దమవుతున్నారని కూడా తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories