Sushant Singh Rajput death case : బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.. దీని గురించి
Sushant Singh Rajput death case : బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.. దీని గురించి పార్లమెంట్ లో కూడా వాదోపవాదాలు కూడా జరిగాయి.. బీజేపీ ఎంపీ రవికిషన్ పార్లమెంట్ లో ఈ ప్రస్తావన తీసుకువచ్చారు. డ్రగ్స్ వ్యసనం బాలీవుడ్ చిత్రపరిశ్రమలో కూడా ఉందని, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అయితే రవికిషన్ వాఖ్యాలను సమాజ్ వాది పార్టీ నేత, ఎంపీ జయా బచ్చన్ ఖండించారు.
కొందరు వ్యక్తుల కారణంగా మొత్తం పరిశ్రమను కించపరచకూడదని ఆమె అన్నారు. మనకు తిండిపెట్టే చేయినే నరుక్కోవద్దని ఆమె మండిపడ్డారు. అయితే జయా బచ్చన్ వాఖ్యలకు కంగనా కూడా తనదైన శైలిలో కామెంట్ చేసింది. అటు ఎంపీ రవికిషన్ వాఖ్యాలకి బీజేపీ నేత జయప్రద మద్దతు ఇచ్చారు. ఈ నేపధ్యంలో సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మా, జయప్రదను టార్గెట్ చేశారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు నుంచి ప్రజలను దారి మళ్లించడానికి మాదకద్రవ్యాలు, బాలీవుడ్‌లో డ్రగ్ కల్చర్ అంశాలను తెర మీదకు తెచ్చారు అంటూ నగ్మా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆమె ఓ ట్వీట్ చేశారు. 'సీబీఐ, ఎన్‌సీబీ, ఈడీ దయచేసి సుశాంత్ కేసులో ఏం జరుగుతుందో బీజేపీ నాయకులు జయప్రద గారికి తెలియజేయండి. సుశాంత్ చనిపోయి ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయింది. దేశప్రజలంతా సుశాంత్ మృతికి కారకులేవరో తెలుసుకోవాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఫలితం లేదు. దీన్ని కవర్ చేయడానికి ఉన్నట్లుండి బీజేపీ నాయకులు బాలీవుడ్‌లో మాదక ద్రవ్యాల వినియోగం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికి కూడా దేశ ప్రజలు సుశాంత్ మృతికి కారకులేవరో తెలుసుకోవాలని భావిస్తున్నారు' అంటూ నగ్మా ట్వీట్ చేశారు.
CBI , NCB , ED pls answer to #BJP Member #JayaPrada Ji on what's happening to #SSR case it's been so long we are all waiting for what's the outcome but no result and to cover up suddenly all #bjp members r talking about drugs in #Bollywood as Nation is still waiting #SSRDeathCase
— Nagma (@nagma_morarji) September 17, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire