క్యాబ్ డ్రైవర్ వేధించాడు.. పంజాగుట్టలో ముమైత్‌ ఖాన్‌ ఫిర్యాదు!

క్యాబ్ డ్రైవర్ వేధించాడు.. పంజాగుట్టలో ముమైత్‌ ఖాన్‌ ఫిర్యాదు!
x

Mumaith Khan

Highlights

Mumaith Khan Respond On Allegations : క్యాబ్ డ్రైవర్ కి డబ్బులు ఎగ్గొట్టారు అంటూ గత రెండు రోజులగా నటి ముమైత్ ఖాన్ ఆరోపణలు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ ఆరోపణలు అవాస్తవమని, దీనిపట్ల ఆమె గురువారం పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Mumaith Khan Respond On Allegations : క్యాబ్ డ్రైవర్ కి డబ్బులు ఎగ్గొట్టారు అంటూ గత రెండు రోజులగా నటి ముమైత్ ఖాన్ ఆరోపణలు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ ఆరోపణలు అవాస్తవమని, దీనిపట్ల ఆమె గురువారం పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.. గత రెండు రోజుల నుంచి తనపై జరుగుతున్న తప్పుడు ఆరోపణల వస్తున్నా నేపధ్యంలో తానూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చానని ముమైత్ ఖాన్ వెల్లడించారు. తనకి క్యాబ్ డ్రైవర్ ను‌ చీట్ చేయాల్సిన అవసరం ఏంటి అని ఆమె ప్రశ్నించారు. కొన్ని మీడియా చానళ్లు తన పరువుకి భంగం కలిగేలా వార్తలు ప్రసారం చేశాయాని తన క్యారెక్టర్ ను‌ జడ్జ్ చేసే అధికారం ఏముంది ఒక్కసారి ఆలోచించండి..అంటూ ముమైత్ వాఖ్యలు చేశారు.

తన మీద డ్రైవర్ తప్పుడు ఆరోపణలు చేశాడని, అతను చెప్పిన దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. అతను రాష్ డ్రైవింగ్ చేసి తనని భయాందోళనకు గురి చేశాడని దీనితో అతనిపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఆమె వెల్లడించారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ పోలీసులకు అందజేశానని ఆమె వెల్లడించారు. ఇక అతనికి 23,500 రూపాయలు చెల్లించినట్టుగా ముమైత్ స్పష్టం చేసింది. ఇక డ్రైవర్‌ రాజు తనని వేధించాడని, ఫ్లయిట్స్‌లో పెట్స్‌ను అనుమతించకపోవడంతో క్యాబ్‌లో వెళ్లానని ముమైత్ ఖాన్ చెప్పుకొచ్చారు.

ఇక అటు మీడియా ఒక్క సైడ్ వర్షన్ తీసుకొని వార్తలు వేయడం తనని బాధించిందని ముమైత్ అన్నారు. తాను 12 సంవత్సరాల నుండి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాను తన క్యారెక్టర్ గురుంచి అందరికీ తెలుసునని అన్నారు.. చివరికి టోల్ గేట్ లకు సంబంధించి పూర్తి డబ్బులు తానే కట్టినట్టుగా..ముమైత్ వెల్లడించారు.

ఇక దీనికి ముందు ముమైత్ గోవా వెళ్ళేందుకు మూడు రోజులకి గాను తన క్యాబ్ బుక్ చేసుకుందని డ్రైవర్ రాజు మీడియాకి వెల్లడించాడు. ఆ తర్వాత టూర్‌ని ఎనిమిది రోజులకు పొడిగించిందని అన్నాడు.. టోల్ చార్జీలకు, డ్రైవర్ అకామిడేషన్‌‌కు డబ్బులు ఇవ్వలేదని, దీనితో రూ.15 వేల వరకు బాకీ పడిందని, మరో డ్రైవర్ కి ఇలా కాకూడదు అన్న నేపధ్యంలోనే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లుగా వెల్లడించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories