Mrunal Thakur: వావ్‌.. మృణాల్‌. కుర్చీ మడతపెట్టి సాంగ్‌కు ఎంత క్యూట్‌గా డ్యాన్స్‌ చేసిందో చూడండి

Actress mrunal thakur dance for kurchi madatha petti song video goes viral
x

Mrunal Thakur: వావ్‌.. మృణాల్‌. కుర్చీ మడతపెట్టి సాంగ్‌కు ఎంత క్యూట్‌గా డ్యాన్స్‌ చేసిందో చూడండి 

Highlights

Mrunal Thakur Dance for Kurchi Madatha Petti song: మహాలక్ష్మీ పాత్రలో నటించిన మృణాల్‌లకు అంతా ఫిదా అయ్యారు.

Mrunal Thakur Dance for Kurchi Madatha Petti song: మృణాల్‌ ఠాకూర్‌.. ఒకే ఒక సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుందీ అందాల తార. హనురాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామమ్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. చీర కట్టులో అసలు గ్లామర్‌కు ఏ మాత్రం స్కోప్‌ లేని పాత్రలో నటించి మెప్పించిందీ చిన్నది.

మహాలక్ష్మీ పాత్రలో నటించిన మృణాల్‌లకు అంతా ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా విజయం తర్వాత మృణాల్‌కు భారీగా అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు దక్కించుకుంటూ దూసుకుపోతోందీ చిన్నది. చివరిగా ఫ్యామిలీ స్టార్‌తో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ చిన్నది కల్కిలో చిన్న రోల్‌లో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిన్నది ప్రస్తుతం హిందీలో వరుసగా 4 సినిమాలతో బిజీగా ఉంది.

అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న మృణాల్‌ మాస్‌ బీట్‌కు తనదైన శైలిలో స్టెప్పలు వేసి ఆకట్టుకుంది. మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం మూవీలో కుర్చీని మడత పెట్టి సాంగ్‌కి స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. మృణాల్‌ క్యూట్‌ స్టెప్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

ఇదిలా ఉంటే మృణాల్‌ ఇప్పట్లో తెలుగు తెరపై కనిపించే అవకాశాలు కనిపించడం లేదు. దీనికి కారణంగా ప్రస్తుతం మృణాల్‌ ఒకేసారి 4 హిందీలో నటించడమే. ఈ సినిమాలు పూర్తయ్యే వరకు ఈ బ్యూటీకి తెలుగు సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి. కాగా విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాలో మృణాల్‌ హీరోయిన్‌గా నటించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories